శ్రీముఖిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హేమ..!

7753
hema comments on sreemukhi going viral
hema comments on sreemukhi going viral

బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక బిగ్ బాస్ షో ముగింపు దశలో ఉండటంతో విన్నర్ ఎవరని బుల్లితెర ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో యాంకర్ శ్రీముఖిపై నటి హేమ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ఆరుగురు ఉన్న ఈ హౌస్ లో ఐదుగురు నామినేట్ లో ఉండగా ఒక్కరు (రాహుల్) ఫైనల్లో ఉన్నాడు. ఇక నటి హేమ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అయింది.

ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ పై ఆమె కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా సీజన్ చివరి దశలో ఉండటంతో మరోసారి నోరు విప్పింది హేమ. ప్రధానంగా శ్రీముఖిని టార్గెట్ చేస్తూ.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హిమజ ఎలిమినేట్ అయ్యేవరకు చూశానని.. తర్వాత చూడటం మానేశానని చెప్పింది. షోలో ఇప్పుడు ఉన్నవారంత ఒక గ్రూప్ వాళ్లే అని హేమ చెప్పింది. వీరందరూ ముందుగానే ఓ ఒప్పందం కుదుర్చుకుని.. ఆ ప్రకారమే షో నడుస్తోందని తెలిపింది.

నేను ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతానేమో అని భావించి వీళ్ళే ఓ స్కెచ్ వేసి నన్ను బయటకు పంపించేశారని.. ప్రధానంగా శ్రీముఖి వల్లే తాను బయటకు వచ్చానని హేమ చెబుతుండటం పలు చర్చలకు దారి తీస్తోంది. అంతా బిగ్ బాస్ విన్నర్‌ అనుకుంటున్న శ్రీముఖి విషయంలో హేమ చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. హేమ చేసిన కామెంట్స్ వల్ల శ్రీముఖికి ఓట్లు తక్కువ పడే ఛాన్స్ ఉంది.

Loading...