Saturday, April 27, 2024
- Advertisement -

తన వెయిట్ లాస్ జర్నీ పై పుస్తకం రాసేసిన జేజమ్మ

- Advertisement -

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గతంలో ‘సైజ్ జీరో` కోసం విపరీతంగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలై ఫ్లాప్ అయింది కానీ ఆ తర్వాత కూడా అనుష్క బరువు తగ్గ లేకపోయింది. ‘బాహుబలి’ ‘భాగమతి’ సినిమా లో అలాగే నటించిన ఈమె తరువాత సంవత్సరకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి బరువు తగ్గడం మీద మాత్రమే దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రియాకి కూడా వెళ్లి ఎట్టకేలకు మళ్లీ స్లిమ్ గా తయారయ్యి ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి అడుగు పెట్టబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క తన వెయిట్ లాస్ జర్నీ ని తన అభిమానులతో పంచుకోవాలని అనుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే అనుష్క ఒక పుస్తకం రాసింది. ‘ది మ్యాజిక్ వెయిట్ లాస్ పిల్’ అనే టైటిల్ తో అనుష్క మరియు ల్యూక్ క్యూటిన్ హో కలిసి ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో బరువు తగ్గడం కోసం మనం రోజువారి పనులలో ఫాలో అవ్వాల్సిన 62 పద్ధతులు ఉంటాయట. ప్రస్తుతం ఈ పుస్తకం మార్కెట్లో మరియు అమెజాన్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. ఇప్పటి దాకా చాలా మంది తమ వెయిట్ లాస్ జర్ని ప్రేక్షకులతో పంచుకున్నారు కానీ టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ లలో దీనిపై పుస్తకం రాసింది అనుష్కనే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -