దర్శకుడు తేజా నన్ను మోసం చేశాడు : హీరోయిన్ రాశి

84133
heroine raasi tells secrets in her life
heroine raasi tells secrets in her life

హీరోయిన్ రాశి.. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టి.. తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోలందరి సరసన నటించి సూపర్ హిట్స్ అందుకుంది. తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తాను పెళ్లింటూ చేసుకుంటే హీరో వెంకటేష్ లేదా.. రాజీవ్ గాంధీని చేసుకుంటానని అమ్మానాన్నలతో చెప్పేదానివి అంటా కదా అని ప్రశ్నించగా.. రాశి వెంటనే సిగ్గుపడి నవ్వింది.

విక్టరీ వెంకటేష్ అన్నా, అలాగే రాజీవ్ గాంధీ అన్నా చాలా అభిమానం అని అందుకే అలా అనేదానిని అని చెప్పింది. ఇక మహేష్ బాబు నిజం సినిమాలోని పాత్ర గురించి చెబుతూ.. దర్శకుడు తేజ తనకు చెప్పిందొకటి, సినిమాలో చూపించిందొకటని చెప్పింది, గోపిచంద్, తను లవర్స్ అని.. మధ్యలో విలన్ వస్తాడని ముందుగా తేజ చెప్పారని.. కానీ సినిమా సెట్స్ పైకి వచ్చాక తన పాత్రను పూర్తిగా మార్చేసి నెగిటివ్ గా చూపించి నన్ను మోసం చేశారని రాశి పేర్కొనడం విశేషం.

ఇక పవన్ కళ్యాణ్ సరసన గోకులంలో సీత సినిమాలో నటించే ఛాన్స్ చిరంజీవి గారి భార్య సురేఖ గారి వల్ల లభించిందని.. ఆమెకి నేను నచ్చడం వల్లే నా పేరు ప్రపోజ్ చేసిందని తెలిపింది. ఇక రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర కోసం అడిగారని.. కానీ మోకాల వరకు ఎక్స్ పోజ్ చేయడం ఇష్టం లేక ఆ పాత్ర ఒప్పుకోలేదని తెలిపింది. ఇక ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన రాశి.. ఈ మధ్య ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి తప్పా.. గుర్తుండిపోయే పాత్రలు మాత్రం రావడం లేదు.

Loading...