Friday, April 26, 2024
- Advertisement -

దర్బార్ సినిమాలో హైపర్ ఆది.. ఏ సీన్ లో అంటే ?

- Advertisement -

సూపర్‌ స్టార రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన దర్బార్‌ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో ఒక డైలాగ్ హైలైట్ అయింది. పంచ్ డైలాగ్స్ సూపర్ స్టార్ రజనీ చెబితుంటే అభిమానులు విజిల్స్ వేయాల్సిందే. రజనీ సినిమాల్లో హిట్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి. భాష ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్టే, నా దారి రహదారి, మంచిది ఇలా రజనీ నోటి నుంచి వచ్చి వైరల్ అయిన డైలాగ్స్ చాలానే ఉన్నాయి.

అయితే దర్భార్ సినిమాలో జబర్దస్త్ గురించి ఓ డైలాగ్‌ ఉంది. అంతే కాకుండా జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉంటున్న కమెడియన్ హైపర్‌ ఆది పేరును రజనీ ప్రస్తావించటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దర్బాలో ఒక కామెడీ సీన్ లో హైపర్ ఆది గురించి ప్రస్తావిచాడు రజనీ. హీరోయిన్‌ నయనతార ఫ్యామిలీకి చెందిన ఓ పెళ్లిలో ఓ చిన్నపాప మెడలోని బంగారు గొలుసు మిస్‌ అవుతుంది. అయితే ఆ గొలుసు వెతకడానికి ఏకంగా సిటీ కమిషనర్‌ ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్‌)ను పిలుస్తుంది నయనతార.

ఎంక్వైరీలో భాగంగా పాపతో రజనీ మాట్లాడిన సందర్బంలో పక్కనే ఉన్న యోగిబాబు ఆది పేరును ప్రస్తావించాడు. గొలుసు ఎక్కడ పోయిందో తెలుకునే ప్రయత్నంలో.. ఆ చిన్నారిని గొలుసు పోగొట్టుకున్నావ్‌ అమ్మా అని అడుగుతాడు రజనీ. అందుకు ఆ పాప ఆ విషయం తెలిస్తే నీకెందుకు ఫోన్ చేస్తాం.. నేనే వెళ్లి వెతుక్కుంటా కదా అంటుంది. షాక్ అయిన రజనీ జబర్దస్త్ పంచా.. అంటే.. పక్కనే ఉన్న యోగిబాబు హైపర్ ఆది ట్రైనింగ్ అంటాడు. రజనీ లాంటి సూపర్‌ స్టార్‌ నోటి నుంచి జబర్దస్త్ ప్రస్తావన రావటం, దర్బార్‌ సినిమాలో హైపర్‌ ఆది పేరు వినిపించటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -