మళ్లీ తన మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్…!

405
Jr NTR Paid Advance Salary To His Staff Because Of Coronavirus
Jr NTR Paid Advance Salary To His Staff Because Of Coronavirus

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయిపోన విషయం తెలిసిందే. దాంతో అన్ని ఆగిపోయాయి. అందులో సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మంచితనం చాటారు. రెండు తెలుగు ప్రభుత్వాలకు రూ.25లక్షల రూపాయల చొప్పున విరాళం అందించారు.

అంతేకాకుండా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ కార్మికుల కోసం 25లక్షల రూపాయాలను విరాళంగా అందజేశాడు. మొత్తం 75 లక్షల రూపాయల విరాళం అందించి మంచి మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ వేళ ఎవరూ బయటకు రావద్దని.. నిబంధనలు పాటించాలని వీడియో సందేశం కూడా ఇచ్చాడు. ఇప్పుడు మరో సాయం చేసి గొప్ప వ్యక్తి అనిపించుకున్నాడు. లాక్ డౌన్ వేళ డబ్బులకు ఇబ్బంది పడుతున్న తనను నమ్ముకుని పని చేస్తున్న తన టీం సభ్యులు వారి కుటుంబాల బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు.

లాక్ డౌన్ అయిపోయేవరకు వారి మొత్తం బాగోగులు తానే తీసుకుంటానని ప్రకటించాడు. లాక్ డౌన్ వేళ వారందరికీ అత్యధిక వేతనం.. రాబోయే రోజుల్లోనే ఏ ఆపద వచ్చినా తానే చూసుకుంటానని.. తన దగ్గర పని చేసేవారందరికి ఎన్టీఆర్ హామీ ఇచ్చారట. ఇలాంటి కష్ట కాలంలో కూడా తనను నమ్ముకున్న వారిని ఎన్టీఆర్ ఆదుకోవడంపై టాలీవుడ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కానుంది.

Loading...