Friday, April 26, 2024
- Advertisement -

మలయాళం నుండి దిగుమతి అవుతున్న దర్శకుడు

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఎంత మంది దర్శకులు ఉన్నా కానీ జనరంజకమైన సినిమాలు చేసే దర్శకులు మాత్రం తక్కువ అయిపోయారు. ఎవరికీ నచ్చిన సినిమాలు వాళ్ళు చేస్తున్నారు కానీ నిజానికి అందులో చాలా తక్కువ సినిమాలు జనాలని ఆకర్షిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ లో నడుస్తున్న ఆసక్తికర చర్చ ఏంటి అంటే మలయాళం లో పేరు మోసిన దర్శకుడు ఐవి శశి కుమారుడు అని శశి ని తెలుగు లో లాంచ్ చేయనున్నారట. అనిశశి ఒక అద్భుతమైన కథ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అని శశి కి ఇంతకు ముందు పెద్ద దర్శకుల వద్ద పని చేసిన అనుభవం ఉంది. తన తండ్రి దగ్గర, అలాగే మరో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర ఈయన అసిస్టెంట్ గా పని చేసారు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ అనిశశి చేయబోయే తొలి తెలుగు సినిమా కి నిర్మాతలు గా ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఒక యువ హీరో తో ఈ సినిమా కి సంబందించిన కథా చర్చలు కూడా మొదలయ్యాయట. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.

తెలుగు లో నే ఎంతో మంది యువ దర్శకులు ఉండగా, ఈ మలయాళ దర్శకుడు ఏ మేరకు పని చేస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -