Friday, April 26, 2024
- Advertisement -

మెగా అల్లుడు మీడియాకి అందుకే దూరంగా ఉంటున్నాడా?

- Advertisement -

ఈ మధ్యనే మెగా హీరోల జాబితాలో చేరాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే మొదటి సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా కళ్యాణ్ దేవ్ తన రెండవ సినిమాని ప్రారంభించాడు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రిజ్వ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కానీ గత కొంతకాలంగా కళ్యాణ్ దేవ్ మాత్రం మీడియా కి దూరంగా ఉంటున్నాడు.

అయితే సినిమా విడుదలకు సిద్ధమయ్యేంతవరకు అలానే ఉండమని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అతనికి సలహా ఇచ్చినట్లు కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ ఒక సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని, గుబురు గడ్డంతో ఉన్న కళ్యాణ్ దేవ్ లుక్ ని సస్పెన్స్ గా ఉంచాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. అందుకే కళ్యాణ్ దేవ్ కెమెరా ముందుకు రావడం లేదని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సినిమాలో సాలిడ్ స్టోరీ ఉండబోతోంది అని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా మెగా అల్లుడు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -