మ‌హ‌న‌టి ఆడియో రిలీజ్‌కు యంగ్‌ టైగ‌ర్‌

1006
NTR As Chief Guest For Mahanati Audio
NTR As Chief Guest For Mahanati Audio

అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘మహానటి’. చిత్రీకరణ పనులు ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన స్టిల్స్‌ టీజర్‌ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా చిత్రయూనిట్ ఆడియో రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది.

ఈ రోజు జరగనున్న ఆడియో వేడుకకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. వైజయంతి మూవీస్‌ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎన్టీఆర్‌ మహానటి ఆడియో రిలీజ్‌కు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో మే 9న విడుదలకానున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత వంటి స్టార్ నటీ నటుల నటించారు.

 

Loading...