విజయ్ సినిమా కి ఎన్టీఆర్ కి ఏంటి సంబంధం?

515
NTR has any Connection With Vijay's Cinema ?
NTR has any Connection With Vijay's Cinema ?

ప్రస్తుతం తెలుగు లో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అని తమిళ హీరోలు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మార్కెట్ ఉన్న హీరోలు దానిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా అని ఎదురు చూస్తున్నారు. మరో వైపు మార్కెట్ లేని వాళ్ళు మాత్రం ఎలాగైనా సరే మార్కెట్ క్రియేట్ చేసుకొని అభిమానులని సొంతం చేసుకోవాలి అని చూస్తున్నారు. తెలుగు, తమిళం లో సరైన మార్కెట్ ఉంటె పాన్ ఇండియా లెవల్ లో రాణించవచ్చు అనేది ముఖ్య ఉదేశ్యం గా ఉంది ఈ హీరోలకి.

ఇకపోతే ఈ సారి విజయ్ నటిస్తున్న చిత్రం బిగిల్ ని మహేష్ కోనేరు అనే యువ నిర్మాత సంపాదించుకున్నారు. ఆయన ఈ సినిమా ని భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అంతర్జాలం లో కొంత మంది ఈ సినిమా కి నందమూరి అభిమానుల సపోర్ట్ ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమా ని దక్కించుకున్న మహేష్ ఇంతకు ముందు ఎన్టీఆర్ దగ్గర పని చేసి కళ్యాణ్ రామ్ తో సినిమాలు చేసినందు వలన ఆన్లైన్ లో కాస్త నందమూరి అభిమానుల సపోర్ట్ ఉండటం తో అలా అంటున్నారు కానీ నిజానికి వేరే ఒక సినిమా కి ఇలా అభిమానులు సపోర్ట్ చేస్తారు అని అనుకోవడం కరెక్ట్ కాదేమో!

ఏది ఏమైనా ఈ సారి బిగిల్ ని తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

Loading...