Friday, April 26, 2024
- Advertisement -

అన్ని OTT చూస్తే ఎలా గురూ.. మరి దియేటర్స్..!!

- Advertisement -

కరోనా వల్ల సినిమాలకు పెద్ద కష్టమే వచ్చింది.. థియేటర్లు లేకపోవడంతో ఎంతో కొంతకు OTT కి అమ్ముకోవాల్సి వస్తుంది.. ఇక పెద్ద సినిమా లకు ఎలాగు మచి డిమాండ్ ఉన్నా ఇంత పెద్ద సినిమా చేసి పెద్ద స్క్రీన్ పై సినిమా లు చూడకుండా ఇలా OTT ఇస్తే ఏం బాగుంటుందని అని ఆలోచిస్తున్నారట.. దాంతో కొంతమంది స్టార్ హీరోలు OTT కి సినిమాలు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారట.. కానీ నిర్మాత కు ఉన్న ఫైనాన్స్ టెన్సన్స్ దృష్ట్యా సినిమాలు ఇవ్వక తప్పట్లేదట.. పైగా మంచి పైకమే ముడుతుండడంతో వారికి ఎలాంటి టెన్షన్ లేదంటున్నారు..

ఇప్పటికే నాని v సినిమా ను OTT కి అమ్మేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ను ఈ సెప్టెంబర్ 5 న రిలీజ్ చేయనున్నారు.. అయితే అంతటితో ఆగకుండా ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో వస్తున్న పెద్ద సినిమాలపై ఈ OTT సంస్థలు కన్నేశాయట.. ఇప్పటికే అక్షయ్ కుమార్ ‘లక్స్మీ బాంబ్’కు హాట్ స్టార్ 150 కోట్లు చెల్లించిందన్న వార్త చాలా రోజులు హాట్ టాపిక్ గా నిలిచిపోయింది. అలాగే విజయ్ మాస్టర్ సినిమా కి కూడా ఫాన్సీ రేట్ వచ్చిందట.. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు 80 కోట్లు ఆఫర్ చేసిన ఓ సంస్థ ఇప్పుడు ఏకంగా రౌండ్ ఫిగర్ చేసి 100 కోట్లు చెప్పిందట.

దాంతో ఈ ఆఫర్ ఎంతో టెంప్ట్ ఉందని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇక ధనుష్ నటించిన ‘జగమే తంతిరం’ సైతం 60 కోట్ల దాకా డీల్ వచ్చిందట. తెలుగులో రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమాలకు కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట.. రామ్ పోతినేని రెడ్, వైష్ణవ తేజ్ ఉప్పెన, రవితేజ క్రాక్, అనుష్క నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా, ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వంటి సినిమాలకు ఊరించే ఆఫర్లు వస్తున్నాయిమొత్తంగా కనివిని ఎరుగని రీతిలో ఇలా ఓటిటిలు నిర్మాతలను ముంచెత్తడం మాత్రం దియేటర్ల భవిష్యత్ ను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -