Friday, April 26, 2024
- Advertisement -

అజ్ఙాతవాసికి షాకుల మీద షాకులు…… పవన్ బ్రహ్మోత్సవంగా నిలిచిపోతుందా?

- Advertisement -

భారీ అంచనాల మధ్య అజ్ఙాతవాసి సినిమా రిలీజ్ అయింది. నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ లేచిపోతాయని అజ్ఙాతవాసి టీం సోషల్ మీడియాలో ప్రచారం చేయించింది. అజ్ఙాతవాసి సినిమాను 125 కోట్లకు అమ్మారు. సినిమాకు బిగ్గెస్ట్ కలెక్షన్స్ తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ తన రాజకీయాన్ని ఫణంగా పెట్టేశాడు. ఇప్పటి వరకూ కేవలం చంద్రబాబు భజన మాత్రమే చేసిన పవన్ అజ్ఙాతవాసి లాభాల్లో తనకు కూడా పర్సంటేజీలు ఉన్న దృష్ట్యా కలెక్షన్స్ రేంజ్‌ని పెంచడం కోసం కొత్తగా కెసీఆర్ భజన కూడా మొదలెట్టాడు. అది కూడా తెలంగాణాకు కెసీఆర్ తప్ప మరో దిక్కు లేదన్న రేంజ్‌లో పొగిడేశారు. కెసీఆర్ సీమాంధ్రులను అవమానించాడని చెప్పి…..ఒకప్పుడు ‘తోలుతీస్తా…..తాట తీస్తా’ అన్న నోటితోనే ఇప్పుడు కెసీఆర్ సూపర్, కేక, అదిరిపోయే పాలన అందిస్తున్నాడు అనే స్థాయిలో పొగిడేశాడు. మరీ చంద్రబాబు స్థాయిలో పూర్తిగా పర్మిషన్స్ ఇవ్వకపోయినప్పటికీ ఒక అదనపు షోకు మాత్రం పర్మిషన్ ఇచ్చాడు కెసీఆర్. అలాగే టిక్కెట్ రేట్స్ పెంచుకోవడానికి మాత్రం ఫుల్ పర్మిషన్స్ దొరికేశాయి అజ్ఙాతవాసి టీంకి.

అయితే ఈ మొత్తం రాజకీయాన్ని పవన్ ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. టిక్కెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉండడంతో కొంతమంది ఫ్యాన్స్ ఈ కలెక్షన్స్ రాజకీయానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా కూడా బాగా లేదన్న టాక్ ముందు నుంచీ ఉన్న నేపథ్యంలో ఒక మూడు రోజుల తర్వాత చూసినా కూడా పోయేది ఏముంది అని లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. షోస్ సంఖ్య భారీగా ఉండడం, టిక్కెట్ రేట్లు అంతకంటే భారీగా ఉండడంతో మొదటి మూడు రోజులు కలెక్షన్స్ అయితే బాగానే ఉండేలా ఉన్నాయికానీ రిలీజ్ అయిన కొన్ని థియేటర్స్‌లో మాత్రం కనీసం హౌస్ ఫుల్స్ కూడా లేవని ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక ఖాళీగా ఉన్న ఒక థియేటర్ పిక్చర్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అన్నింటికీ మించి రివ్యూస్ అన్నీ కూడా నెగిటివ్‌గానే ఉన్నాయి. ఈనాడులో కూడా నెగిటివ్ రివ్యూనే రావడంతో ఫ్యాన్స్ కూడా డీలాపడిపోయారని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఇక లార్గోవించ్‌ని కాపీ కొట్టడం కూడా పూర్తిగా నిజమని రూఢీ అవ్వడంతో నైతికంగా కూడా త్రివిక్రమ్, పవన్‌లు దిగజారినట్టు అయింది. మరోవైపు సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. అలాగే మొదటి రోజు మొదటి షోలు చూసిన ప్రేక్షకుల సంఖ్య కూడా గత పవన్ కళ్యాణ్ సినిమాల కంటే తక్కువగా ఉందని ట్రేడ్ ఎక్స్‌పర్స్ట్ చెప్తున్నారు. మొత్తంగా ఈ అజ్ఙాతవాసి సినిమా పవన్ బ్రహ్మోత్సవం అనేలా మిగిలిపోవడం ఖాయం అని చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -