Friday, April 26, 2024
- Advertisement -

పోలీసులకు అడ్డంగా దొరికిన హీరో ప్రిన్స్..!

- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి సమాజంలో మందు తాగి డ్రైవ్ చేసేవాళ్లు తగ్గడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని.. అది తమతో పాటు ఇతరలకు ప్రమాదకరమని పేర్కొంటూ ఎన్నో అవగాహనా కార్యక్రమాలను ప్రభుత్వం చెపడుతున్నప్పటికి ఈ మందుబాబుల ఆగడాలు ఆగేలా లేవు. నిత్యం ఎంతోమంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చిక్కుతున్నారు.

ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొన్ని సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని చెప్పే నటీనటులు.. వాళ్లే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతున్నారు. గతంలో యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదం అని చెప్పి.. అతని డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. ఇక తాజాగా నటుడు, బిగ్ బాస్ కంటిస్టెంట్ ప్రిన్స్ మద్యం సేవించి వాహనం నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌‌‌లో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.

నిన్న(సోమవారం) రాత్రి హైదరబాద్ నగరంలోని కూకట్ పల్లిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రిన్స్ దొరికాడు. దాంతో వెంటనే పోలీసులు ప్రిన్స్ కారును సీజ్ చేసి.. అతనిపై కేస్ నమోదు చేశారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) కూకట్ పల్లి కోర్టుకి ప్రిన్స్ హాజరయ్యాడు. దర్శకుడు తేజ డైరెక్షన్ లో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ సినిమాతో ప్రిన్స్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బస్ స్టాప్, నేను శైలజ సినిమాల్లో నటించాడు. బిగ్ బాస్ సీజన్ వన్‌లో కంటిస్టెంట్‌గా పాల్గొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -