Friday, April 26, 2024
- Advertisement -

చొక్కా విప్పిన హీరో.. సిగ్గు పడ్డా అనసూయ..! (వీడియో)

- Advertisement -

ఏడేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ కామెడీ షో ఎంతగానో నవ్విస్తోంది. ప్రతీ పండగకు ఏదో ఒక స్పెషల్ ఎపిసోడ్‌తో జబర్దస్త్ ముందుకు సాగుతోంది. తాజాగా ఈ సంక్రాంతికి ఓ స్పెషల్ ఎపిసోడ్ తో ఫన్ క్రియేట్ చేయబోతోంది. విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ షోలో అప్పుడప్పుడు టాలీవుడ్ నటులు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుంటారు. ఇదే బాటలో వచ్చేవారం ఓ సీనియర్ హీరో జబర్దస్త్ షోలో సందడి చేయబోతున్నాడు.

జనవరి 16న ఈ స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ఓ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో వీడియోలో సీనియర్ హీరో పృథ్వీ సందడి కనిపించింది. తన ఎవర్‌గ్రీన్ హిట్ సాంగ్ ”రుక్కు.. రుక్కు.. రుక్కుమని..” సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ.. పోలీస్ గెటప్‌లో పంచ్ డైలాగులతో నవ్వించాడు. అంతేకాదు షర్ట్ సిప్పేసి తన సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ హల్చల్ చేశాడు.

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీ. రోజాతో కూడా ఈ హీరో కొన్ని సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ఏకంగా రోజా ముందే ఇలా షర్ట్ విప్పేసి సిక్స్ పాక్ చూపించడం ఆసక్తికరంగా మారింది. జబర్దస్త్ వేదికపై పృథ్వీ చేసిన ఈ ఫ్రీ షో చూసి రోజా నవ్వు ఆపుకోలేకపోయింది.

మరోవైపు అనసూయాది కూడా అదే పరిస్థితి. ఇద్దరూ సిగ్గు మొగ్గలు వేస్తూ తెగ నవ్వేశారు. దీంతో ఈ ప్రోమో వైరల్ అయింది. అయితే ఈ రేంజ్‌లో రోజా, అనసూయ ముందు షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపించడాలు కాస్త ఓవర్ అయిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ప్రోమోలో సుధీర్, హైపర్ ఆది పంచులు కూడా హైలైట్ అయ్యాయి. మీరు కూడా ఆ ప్రోమోను చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -