పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ సినిమాకి ముహూర్తం ఫిక్స్

234
Puri Jagannadh, Vijay Devarakonda's film shooting date fixed
Puri Jagannadh, Vijay Devarakonda's film shooting date fixed

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్యనే రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మర్చిపోలేని హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు అదే జోష్ తో యువ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు పూరి జగన్నాథ్. మరోవైపు ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ‘హీరో’ అనే సినిమా తో బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కాబోతుందట.

ప్రస్తుతం షూటింగ్ లోని ఆఖరి షెడ్యూల్ జరుగుతోందని, ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్ మరియు పూరి జగన్నాథ్ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలు కానుంది. అయితే ‘హీరో’ సినిమా షూటింగ్ అక్టోబర్లో పూర్తవుతుందట. నవంబర్ మొత్తం ఈ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉండే విజయ్ దేవరకొండ డిసెంబర్లో పూరి సినిమాలో తన పాత్రకి కావలసిన ఫిజిక్ కోసం ప్రయత్నించనున్నాడు. ఈ సినిమా కూడా ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Loading...