Friday, April 26, 2024
- Advertisement -

ర‌ష్మిక‌ బ్రేక‌ప్‌ వెనుక ఉన్న అస‌లైన నిజాలు…

- Advertisement -

వరుస సినిమాలు, విజయాలతో పరుగులు పెడుతున్న రష్మిక మందన్న కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన నిర్ణయాలను చకచకగా తీసేసుకొంటున్నారు. దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నే సామెత‌ను బాగా ఒంట‌ప‌ట్టించుకుంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక సినీ లైఫ్ మంచి ఊపుమీదుంది.

‘గీతా గోవిందం’ హిట్ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ అయ్యేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. కెరీర్ కోసం రక్షిత్‌శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్మిక పెద‌వి ఇప్ప‌లేదు.

తాజాగా ఓ కన్నడ చిత్రం నుంచి ఆమె తప్పుకొన్న వార్తలు రావడంతో ఆ విషయాన్ని రష్మిక ధృవీకరించారు. దీంతో పాటే రక్షిత్‌శెట్టితో ఎంగేజ్‌మెంట్ ర‌ద్దుపై కూడా క్లారిటీ ఇచ్చారు. డబ్బు – పేరు – పరపతి మూడు వస్తుండడంతో అనవసరంగా పెళ్లి చేసుకొని వీటన్నింటిని మిస్ కాకూడదని నిర్ణయించుకున్న‌ట్లు తెలిపింది. అందుకే ఇప్పుడుఫుల్ ఫోకస్ మొత్తం కెరీర్ మీదే పెట్టింది.

కన్నడలో తాను ఒప్పుకున్న ‘వ్రిత్రా’ అనే సినిమా నుంచి వైదొలిగాను. ఆ చిత్రంలో నటించకూడదని నిర్ణయించుకున్నాను. కెరీర్ ఆరంభంలో ఇలాంటి చిత్రం చేయకూడదని వైదొలుగుతున్నాను’ అని చెప్పి ప్ర‌ధాన కార‌ణాలు మాత్రం చెప్ప‌లేదు.

వ్రిత్రా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ పాత్రలో మరొకరు బ్రహ్మండంగా రాణిస్తారని అనుకొంటున్నాను. వ్రిత్రా డైరెక్టర్ గౌతమ్, రక్షిత్ శెట్టి క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లనే సినిమా నుంచి తప్పుకొన్నట్టు కన్నడ మీడియా కథనాన్ని వెల్లడించింది. దీంట్లో ఎంత నిజ‌ముంద‌నేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -