Friday, April 26, 2024
- Advertisement -

ఒక‌సారి మోస‌పోయా చాలదా అంటున్న రష్మిక

- Advertisement -

డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ తో బిజీ బిజీ గా గడుపుతున్న భామ రష్మిక మందన్న. ఈ సినిమా లో లిల్లీ అనే పాత్ర ని పోషిస్తుంది ఈ హీరోయిన్. అయితే ఈ మధ్య రష్మిక ప్రేమలో పడింది అనే పుకార్లు ఎక్కువ గా వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ విషయం మీద రష్మిక ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అందుకనే మీడియా వాళ్ళు మాత్రం రష్మిక తో ఇంటర్వ్యూ సమయం లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

అయితే మీరు ప్రేమలో పడ్డారా అని అడిగినందుకు రష్మిక తెగ నవ్వేసింది. తనకి అసలు తిండి తినడానికి కూడా సమయం ఉండటం లేదట. అలాంటిది ప్రేమ లో పడేంత సమయం ఎక్కడిది అని ఎదురు ప్రశ్నించింది. “నేను ప్రేమలో లేను. ప్రస్తుతం నేను సింగిల్ గా ఉన్నాను. నాకు ఈ మధ్య షూటింగ్స్ తో తీరిక లేకుండా ఉంది. ఇల్లు, జిమ్, షూటింగ్ తప్ప ఇంకో ప్రపంచం తెలియడం లేదు. ఒక్కోసారి తిండి తినటానికి కూడా సమయం ఉండటం లేదు. అలాంటిది నేను ప్రేమలో పడితే కచ్చితంగా అందరికీ ముందే చెప్తాను.” అని సెలవిచ్చింది రష్మిక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -