అజయ్ భూపతి కి ఆడవాళ్లంటే ఎందుకంత కోపం..

- Advertisement -

RX100 సినిమా తో మంచి డైరెక్టర్ గా అజయ్ భూపతి పేరు తెచ్చుకున్నాడు.. దాంతో ఆ సినిమా తర్వాత రెండో సినిమా కోసం అయన ప్రయత్నాలు చేస్తుండగా అది పలుసార్లు విఫలమయ్యింది.. అయన RX100 తర్వాత మహాసముద్రం అనే సినిమా ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండగా చాలామంది హీరో లు ఆ సినిమా ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.. మొదట ఈ కథ రవితేజ దగ్గరికెళ్లింది ఆ తర్వాత నాగచైతన్య, ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ ఇలా ముగ్గురిదగ్గరికెళ్ళి ఆ సినిమా కథ వెనక్కి వచ్చేసింది.. ఇప్పుడు అదే కథను శర్వానంద్ కి చెప్పి ఒప్పించాడు అజయ్..

అయితే ఇంత మంది రిజెక్ట్ చేసిన కథతో శర్వానంద్ సినిమా చేయడం ఆయన అభిమానులకు నచ్చడం లేదు.. ఈనేపథ్యంలో అసలే ఫ్లాప్ లలో ఉన్న శర్వా కి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ ఇస్తుందో చూడాలి.. ఇక విషయంలోకి వస్తే తన మొదటి సినిమా లో విలన్ గా హీరోయిన్ ని చేసి పెద్ద సాహసమే చేశాడు అజయ్.. ఇప్పుడు అదే దారిలో తన రెండో సినిమాలో కూడా హీరోయిన్ ని విలన్ చేయనున్నాడట..`ఆర్‌.ఎక్స్ 100` టైపులో కామ పిచాచి టైపు పాత్ర కాదు గానీ, హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్ షాకింగ్ గా ఉండ‌బోతోంద‌ని టాక్‌.

- Advertisement -

`మ‌హా` అనే పాత్ర చుట్టూ తిరిగే క‌థ ఇది. విశాఖ సముద్ర తీరం నేప‌థ్యంలో సాగుతుంది. అందుకే ఈ సినిమాని `మ‌హా స‌ముద్రం` అని పేరు పెట్టారు. క‌థానాయిక పాత్ర‌నే టైటిల్ గా పెట్టారంటే.. క‌థ‌లో కూడా త‌న‌కు కీల‌క‌మైన పాత్ర ఉన్న‌ట్టే. మ‌రి ఆ పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. ఈ సినిమాలో హీరో గా నటిస్తున్న శర్వానంద్ స్వయం శక్తి తో వచ్చిన హీరో.. తొలిసినిమానుంచి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ఓ స్థాయి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నారు.. మంచి అనుభూతిని ఇచ్చే నటనకు శర్వానంద్ కేర్ అఫ్ అడ్రస్.. న్యాచురల్ స్టార్ నాని తర్వాత సెకండ్ టైర్ హీరోల్లో శర్వా రెండో స్థానం అని చెప్పొచ్చు.. శర్వాకి ప్రభాస్ లాంటి హీరోల బ్యాక్ అప్ ఉందని చెప్పొచ్చు.. అలాంటి శర్వానంద్ గత కొన్ని సినిమాలు గా ఫ్లాప్ లని ఎదుర్కొంటున్నాడు.. మరి ఈ సినిమా అయినా హిట్ అవుతుందో చూడాలి..

సునీల్ తో రాజ్ తరుణ్.. హీరో గా కాదా..?

గుణశేఖర్ హిరణ్య కశ్యప పై క్లారిటీ ఇచ్చినట్లేనా..?

రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా వీడని సందేహం..

Most Popular

టీఆర్ఎస్ వ్యూహాన్ని మార్చే టైం వచ్చిందా..?

కేసీఆర్ ఏది చేసినా సంచలనమే.. తెలంగాణ తీసుకువచ్చే దగ్గరినుంచి నిన్నటి రెవెన్యూ చట్టంలో మార్పుల వరకు అన్ని కేసీఆర్ నిర్ణయాలు చరిత్ర ని తిరగరాసినవే అని చెప్పుకోవాలి.. మొదటి సారి...

’కలర్ ఫోటో’ సినిమాకోసం సునీల్ ఎంత తీసుకున్నాడంటే ?

సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ’కలర్ ఫోటో’. ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ నెగిటివ్ షేడ్ లో ఉన్న...

చినబాబు ఇక ఇంటికే పరిమితమా..?

ఎంతలేదన్నా టీడీపీ కి భవిష్యత్ లో కాబోయే రారాజు. రేరాజు నారా లోకేష్ అని చెప్పాలి.. చంద్రబాబు అతన్ని నాయకుడిని చేయడం కోసం పడుతున్న కష్టం చూసైనా ప్రజలు లోకేష్...

Related Articles

శర్వానంద్ ఆశలన్నీ ఆ సినిమా పైనే..!

శర్వానంద్ కి కొన్ని రోజులుగా బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి.. అయన విజయాన్ని చూసి చాల రోజులే అయిపొయింది. రాధా, మహానుభావుడు, పడిపడిలేచి మనసు, రణరంగం, జాను సినిమా లు...

పుష్ప లో వైసీపీ ఎమ్మెల్యే రోజా..!

అల వైకుంఠపురలో తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో పుష్పా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. శేషాచలం...

90 ఎంఎల్ టీజర్ లో తాగుబోతుగా కార్తికేయ

'ఆర్ఎక్స్ 100' వంటి బోల్డ్ సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ రొమాంటిక్ ఎంటర్టైనర్ అయిన 'హిప్పీ' తో మాత్రం మంచి విజయాన్ని సాధించలేదు. తాజాగా నాని హీరోగా నటించిన 'గ్యాంగ్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...