సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?

1067
salman khan bodyguard shera salary

ఏ సెలబ్రిటీ అయిన ఎక్కడకు వెళ్లాలన్న అతనికి ఓ బాడీగార్డ్ తప్పనిసరి. అతనే ఆ సెలబ్రెటీకి నమ్మకంగా ఉంటాడు. సెలబ్రేటిని 24 గంటలు కాపాడుకుంటూ ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి కోసం ఆ సెలబ్రెటీ ఏమైనా చేస్తాడు. ఎంత జీతం ఇచ్చిన నమ్మకంగా పని చేసేవారు తక్కువ మంది ఉంటారు. కానీ ఎలాంటి స్వార్దం లేని బాడీగార్డ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మన్ ఖాన్ కు దొరికాడు. అతని పేరు షెరా. అతను ఒక బార్డీగాడే కానీ సల్మాన్ ఖాన్ కు షెరా అంటే చాలా ఇష్టం.

ప్రాణంగా చూసుకుంటాడు. ఇంట్లో వ్యక్తిలానే అతనిని కూడా చూస్తాడు. ఇక షెరా కూడ తన ప్రాణం కంటే ఎక్కువగా సల్మాన్ ను ప్రేమిస్తాడు. అలా ఈ ఇద్దరు ఉంటారు. ఇప్పుడు కాదు.. 1996 నుంచి సల్మాన్ దగ్గర ప్రాణమించే సెక్యూరిటీగా షెరా పని చేస్తున్నాడు. షెరా అలాంటి వ్యక్తికి జీతం ఎంత ఇవ్వాలి. బయట ఎంతమంది ఆఫర్ చేసినా కూడా సల్మాన్ దగ్గరే ఉన్నాడు షెరా. అందుకే సల్మాన్ కూడా అతనికి కావల్సినంత జీతం ఇస్తున్నాడు.

షెరాకు నెలకు దాదాపుగా 15 నుంచి 20 లక్షల వరకు ఇస్తున్నాడని తెలుస్తోంది. దానికి తోడు అదనపు అలమెన్సులు కూడా ఉంటాయి. మొత్తంగా ఏడాదికి దాదాపుగా 2.5 కోట్ల వరకు షెరా సంపాదన ఉంటుందని బాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి. సో ఏది ఏమైన అతని జీతం పక్కన పెడితే ఇన్నెళ్ళు సల్మాన్ కు నమ్మకంగా షెరా ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ మధ్యే షెరాకు ఓ సొంత ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చాడు సల్మాన్ ఖాన్.

Loading...