Saturday, April 27, 2024
- Advertisement -

సమంత బర్త్ డేకి చైతు ఇచ్చిన గిఫ్ట్ ఇదే..!

- Advertisement -

కేవలం గ్లామర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాదు.. నటనకు ఆస్కారమున్న పాత్రలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకెళ్తుంది అక్కినేని కోడలు సమంత. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. పెళ్లి తర్వాత నటనకు బై చెప్పకుండా సినిమాలు చేస్తూ తనకు సినిమాలపైన ఎంత ప్రేమ ఉందో చూపిస్తోంది.

సమంత పెళ్లి తర్వాత సినిమాలు చేసి పలువురు హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం సమంత, ఆమె భర్త నాగ చైతన్య ఇంట్లోనే ఉంటున్నారు. ఇక ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా నిరాడంబరంగా జరిగాయి. తన భార్య కోసం స్వయంగా చైతూ వంటగదిలోకి వెళ్లి గరిట పట్టాడు. బర్త్ డే కేక్ ను తయారు చేశాడు.

ఆపై సమంత దాన్ని కట్ చేసి.. భర్తకు తినిపించింది. ఈ వీడియోను, చిత్రాలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్ లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. “కుటుంబం ప్రేమ… నేను దేని కోసం ప్రార్థిస్తున్నానో మీరు ఊహించలేరు” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక పలువురు స్టార్ హీరో, హీరోయిన్లు, ప్రముఖులు సమంతకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

https://www.instagram.com/p/B_fv8iVhcaV/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -