Friday, April 26, 2024
- Advertisement -

తెలుగు లో నిర్మాణం స్టార్ట్ చేస్తున్న చరణ్

- Advertisement -

దాదాపు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా సింగర్ గా మరియు నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. దాదాపు 2500 పైగా పాటలు పాడిన ఎస్పీ చరణ్ నిర్మాతగా చాలా డబ్బులు నష్టపోయారట. ఈ విషయాన్ని అలీ టాక్ షోలో బయటపెట్టారు ఎస్పీ చరణ్. ‘వర్షం’ సినిమా తమిళ రీమేక్ కోసం అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టామని దాని వల్ల చాలా డబ్బులు నష్టం వచ్చిందని అన్నారు.

మొదటి సినిమా కి డబ్బు ఇచ్చింది తన తండ్రే నని, రెండో సినిమాకు బిజినెస్ జరిగినప్పటికీ, పెట్టుబడి పెట్టిన వాళ్లకు డబ్బులు రాకపోవడంతో ఆ మొత్తాన్ని మళ్లీ నాన్నగారి దగ్గర డబ్బు తీసుకుని చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. మూడో సినిమాకి బాగానే డబ్బులు ముట్టడంతో వరుసపెట్టి మరో మూడు సినిమాలను నిర్మించారు కానీ అన్నీ ఫ్లాప్ అవ్వడంతో నష్టం మరింత ఎక్కువైపోయిందని అన్నారు.

అయితే ఇప్పుడు ఆర్థికం గా తాను సెటిల్ అయ్యానని, త్వరలో తెలుగు లో సినిమా నిర్మించనున్నట్లు తెలిపాడు. చరణ్ నిర్మాణం లో డైరెక్ట్ తెలుగు సినిమా ఇప్పటి వరకు రాలేదు కానీ ఇప్పుడు చరణ్ నిర్మించాలని చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -