Friday, April 26, 2024
- Advertisement -

శ్రీముఖి లవర్ దొరకుడు.. విష్ణుప్రియ కామెంట్స్..!

- Advertisement -

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో సీరియల్స్ ఎపిసోడ్స్ ఆగిపోయాయి. దాంతో బుల్లితెరపై టెలికాస్ట్ చేసిన వాటినే మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో జీ తెలుగు, స్టార్ మా తెలుగు చానెల్స్ కొత్తరకంగా ఉండాలనే ఆలోచనతో కొత్త కార్యక్రమాలను ప్రారంభించాయి. లాక్‌డౌన్ కాలంలో సెలబ్రిటీ టాక్ షోలను ప్రారంభించిన వారిలో యాంకర్ ఝాన్సీ, యాంకర్ రవి ముందు వరుసలో ఉన్నారు.

ఝాన్సీ లవ్ యూ జిందగీ మొదలుపెడితే.. యాంకర్ రవి లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి అంటూ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, సరదా సరదా ముచ్చట్లతో కొత్త షోలను తాత్కాలికంగా ప్రారంభించారు. తాజాగా ఝాన్సీ షూట్ చేసిన లవ్ యూ జిందగీ ఎపిసోడ్‌లో శ్రీముఖి, విష్ణు ప్రియ, జబర్దస్త్ రాకేష్ పాల్గొన్నారు. . జూన్ 12న ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌లో శ్రీముఖి, విష్ణు ప్రియ కేక పెట్టించారు. బోల్డ్, బ్యూటిఫుల్‌గా సమాధానాలు, భావాలను పంచుతూ రచ్చ చేశారు. ఈ ఎపిసోడ్‌లో శ్రీముఖి బాయ్‌ఫ్రెండ్ గురించి విష్ణుప్రియ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఝాన్సీతో శ్రీముఖి మాట్లాడుతూ.. నాకు డాక్టర్లు అంటే చాలా ఇష్టం అని చెప్పింది. దానికి ఝాన్సీ రెస్పాండ్ అవుతూ.. డాక్టర్లు మీరు వింటున్నారా? అంటూ ఆటపట్టించారు.

అంతేకాకుండా చేతికి మెహందీ పెట్టుకొంటే.. బాగా పండింది. నీకు మంచి మొగుడు వస్తాడు అని చురకలంటించింది. విష్ణుప్రియ మాట్లాడుతూ.. తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీముఖికి బాయ్‌ఫ్రెండ్ దొరకడు అంటూ కామెంట్ చేసింది. ఎందుకంటే తను ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దొరకడు అని చెప్పింది. ఇక శ్రీముఖికి ఎలాంటి బాయ్‌ఫ్రెండ్ లభించాలనే విషయంపై విష్ణుప్రియ చెబుతూ.. నా ఫ్రెండ్ కి రిచ్‌గా ఉండే లవర్ దొరకాలి. మమల్ని ఎప్పుడూ ప్రైవేట్ జెట్ విమానాల్లో ట్రిప్‌కు తీసుకెళ్లే వాడు రావాలి. అలాంటి వాడు ఎప్పుడు పై నుంచి ఊడి పడుతాడో వేచి చూస్తున్నాను అంటూ కామెంట్ చేశారు.

మళ్లీ తన డాన్స్ తో రచ్చ చేసిన ప్రగతి ఆంటీ (వీడియో)

విజయశాంతి గురించి మనకి తెలియని విషయాలు..!

నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందించిన బాలయ్య..!

చిరు వర్సస్ బాలయ్య ఇష్యూపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -