Thursday, May 9, 2024
- Advertisement -

చిన్న‌వాడితో ఎఫైర్ పెట్టుకుంటే ఏంటీ..?

- Advertisement -

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి మ‌రోసారి తన మాటల‌తో వార్త‌ల్లో నిలిచింది.ఈసారి బాలీవుడ్‌ను టార్గెట్ చేసుకుని మాట‌ల తూటాలు పేల్చింది శ్రీరెడ్డి. మలైకా అరోరా, అర్జున్ కపూర్‌ల ఎఫైర్ గురించి బాలీవుడ్‌లో మీడియాలో చాలానే వార్తలు వచ్చాయి.అర్జున్ కారణంగానే మలైకా తన భర్తకి విడాకులు ఇచ్చిందంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విడాకులు తీసుకున్న తరువాత మలైకా, అర్జున్ లు విచ్చలవిడిగా తిరుగుతున్నారు.ప‌లు ఈవెంట్లకు వెళ్ల‌డంతో పాటు ఫారెన్ టూర్లకి కూడా వెళ్లారు.వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా వార్తలను ప్రచురిస్తోంది. అయితే వీరిద్ద‌రి రిలేష‌న్‌షిప్ గురించి కామెంట్ చేసింది శ్రీరెడ్డి.

”మలైకా, అర్జున్ కపూర్ ల జంట ఎంతో క్యూట్ గా ఉంది. మీకు నచ్చినట్లు జీవించడంలో తప్పు లేదు. ఈ సమాజం కోసం మీరు బాధ పడకండి. మనం ఎలా ఉన్నా ఈ సమాజం మనల్ని బ్లేమ్ చేస్తూనే ఉంటుంది.విడాకులు తీసుకోవడం తప్పు కాదు.. వయసులో చిన్నవాడితో రిలేషన్ పెట్టుకోవడం నేరం కాదు. మీ ఇద్దరికీ నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. అదే పెద్ద వ‌య‌స్సులో హీరో చిన్న వ‌య‌స్సు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీడియా ఇంత హైలెట్ చేస్తుందా అని ప్ర‌శ్నించింది శ్రీరెడ్డి.మీరు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను అంటూ త‌న ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చింది శ్రీరెడ్డి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -