Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ వీళ్లేనా?

- Advertisement -

బుల్లి తెర మీద ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినా కానీ బిగ్ బాస్ షో కి వచ్చిన ప్రాముఖ్యత ఈ మధ్య కాలం లో ఇంకా ఏ షో కి రాలేదు. మొదటి సీజన్ కి వ్యాఖ్యాత గా ఎన్టీఆర్ వ్యవహరించగా శివ బాలాజీ విన్నర్ గా నిలిచాడు. ఈ మొదటి సీజన్ చాలా పెద్ద హిట్ అయింది. నాని వ్యాఖ్యాత గా వ్యవహరించిన రెండో సీజన్ పెద్ద ఎత్తున హిట్ అవ్వకపోయినా అన్ని విధాలుగా బాగానే నడిచింది. కౌశల్ రెండో సీజన్ విన్నర్ గా నిలిచాడు. ఇకపోతే వచ్చే నెల మధ్య నుండి మూడో సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కమింగ్ సూన్ ప్రోమోస్ కూడా స్టార్ మా ఛానెల్ వాళ్ళు విడుదల చేసారు. రేపో ఎల్లుండో నాగార్జున షో కి హోస్ట్ గా వ్యవహరిస్తాడు అనే వార్త ని కూడా అధికారికం గా ప్రకటించనున్నారు. ఈ దశ లో ఇప్పుడు షో లో ఎవరు కంటెస్టెంట్స్ గా ఉంటారు అనే విషయం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఇటీవల సోషల్ మీడియా లో వస్తున్న కథనాల ప్రకారం ఈ కింద పేర్కొన్న సెలెబ్రిటీలు బిగ్ బాస్ షో లో పాల్గొననున్నారు అని తెలుస్తుంది.

శోభిత ధూళిపాళ
చైతన్య కృష్ణ – నటుడు
గెటప్ శ్రీను
సింగర్ రేవంత్
సింగర్ రాహుల్ సిప్లిగంజ్
శ్రీముఖి
రఘు మాస్టర్ – కొరియోగ్రాఫర్
సీనియర్ హీరో వేణు

మరి కొంత మంది తో కూడా సంప్రదింపులు జరుపుతున్న నిర్వాహకులు ఆ వివరాలని గోప్యం గా ఉంచుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -