Friday, April 26, 2024
- Advertisement -

వరుణ్ తేజ్ మాస్.. ఊర మాస్..

- Advertisement -

సరి కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో ఎప్పుడూ ముందుండే మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు అలాంటి ఒక ఆసక్తికరమైన కథ తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ రీమేక్, ‘వాల్మీకి’ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అథర్వ మురళి ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. హరీష్ శంకర్ చెప్పినట్టుగానే ఈ వీడియోలో డైలాగ్ లు ఏమీ లేవు.

కేవలం 19 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాలో వరుణ్ తేజ్ లుక్ ఎలా ఉండబోతోంది అని తెలియజేస్తుంది. నలుపు రంగు డ్రెస్సు, మెడలో రుద్రాక్ష మాలలు, చేతిలో గన్, గుబురు గడ్డం తో వరుణ్ తేజ్ సినిమాలో ఒక్క సరి కొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. వరుణ్ తేజ్ లుక్ ఊర మాస్ గా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కేవలం వరుణ్ తేజ్ లుక్ తోనే సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు దర్శయా నిర్మాతలు. రామ్ ఆచంట మరియు గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -