Friday, April 26, 2024
- Advertisement -

ఎంత ప‌ని చేశావ్ ..విజ‌య్ దేవ‌ర‌కొండ…!

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌నల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ టాక్సీవాలా సినిమాతో తానేంటో మ‌రోసారి నిరుపించుకున్నాడు.సినిమా విడుద‌ల‌కు ముందే టాక్సీవాలా ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అయిన‌ప్ప‌టికి సినిమా సూప‌ర్ హిట్ అయింది.సినిమా హిట్ అవ్వ‌డంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.ఈ వేడుకకి ‘టాక్సీవాలా’ టీమ్ తో పాటు అల్లు అరవింద్, దర్శకుడు మారుతి కూడా వచ్చారు. ఈ క్రమంలో ఫోటోలను ఫోజులిచ్చే సమయంలో విజయ్ దేవరకొండ తన పక్కనే ఉన్న అల్లు అరవింద్ భుజాలపై చేయి వేసి నిలబడ్డాడు.

విజయ్ దేవరకొండ అలా అల్లు అరవింద్ భుజాలపై చేయి వేయ‌డాన్ని త‌ప్పుప‌డుతున్నారు కొంద‌రు నెటిజన్లు.ఓ సీనియర్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఎంతో పేరున్న వ్యక్తి విషయంలో అలా ప్రవర్తించడం ఎవ‌రికి న‌చ్చ లేదు.దీనిపై విజ‌య్‌ని గ‌ట్టిగానే ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్లు.ఈ విష‌యం పై స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌…తనకు అల్లు అరవింద్ గారిని తక్కువ చేసే ఉద్దేశం లేదని, తన తండ్రిగా భావించి ఆయనపై అభిమానంతో చేయి వేశానని వాళ్లకి సర్ది చెప్పారట విజయ్ దేవరకొండ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -