విజయ్ దేవరకొండ తన రూటు మార్చడా?

194
Vijay Devarakonda Lip Lock Scenes in Dear Comrade
Vijay Devarakonda Lip Lock Scenes in Dear Comrade

ఈ మధ్యనే ‘టాక్సీవాలా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు మళ్ళీ తన బ్లాక్ బస్టర్ సినిమా ‘గీతగోవిందం’ లో హీరోయిన్ రష్మిక మందన్న తో కలిసి ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 26న విడుదల కాబోతోంది. ‘గీత గోవిందం’ రేంజ్లో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని విజయ్ దేవరకొండ మరియు చిత్రబృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ దేవరకొండ కూడా షూటింగ్ నుంచి ప్రోమోషన్ల దాకా సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అయితే ఎంత సేపూ యువతను ఎట్రాక్ట్ చేసే సినిమాలు పై మాత్రమే దృష్టి పెడుతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఆడియన్స్ ను మర్చిపోతున్నాడు అంటూ కొందరు వాదిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘గీతగోవిందం’ సినిమాలు మాత్రమే అనుకుంటే ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు కూడా లిప్ లాక్స్ అధికంగా ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ ని మరియు పిల్లలని థియేటర్లకు రాకుండా చేస్తోంది. ‘డియర్‌ కామ్రేడ్‌’ కోసం యువతతో పాటు ఫ్యామిలీస్‌ కూడా ఎదురు చూస్తున్నారు. యువతను ఆకర్షించే సినిమాలు తీయడం ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ అవి ఒక వర్గం ప్రేక్షకులకి అభ్యంతర కరంగా మార్చాల్సిన అవసరం లేదు. మరి ఈ విషయంలో విజయ్ దేవరకొండ ఇప్పుడైనా జాగ్రత్తలు తీసుకుంటాడు లేదో చూడాలి.

Loading...