Saturday, April 27, 2024
- Advertisement -

అనంత‌పురంలో టీడీపీకీ బిగ్ షాక్‌ ……పార్టీని వీడుతున్న జేసీ, ప‌రిటాల‌ ఫ్యామిలీలు

- Advertisement -

ఇటీ వ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి దెబ్బ‌కు రాష్ట్రంలో టీడీపీ పార్టీ తుడిచి పెట్ట‌కుపోయింది. కొన్ని జిల్లాల్లో అస‌లు ఖాతానె తెర‌వ‌లేదు. ఫ్యాన్ సునామీలో మ‌హామ‌వులంతా మ‌ట్టిక‌రిచారు. దీంతో ఆపార్టీలో అందిర‌లోనూ వైరాశ్యం నెల‌కొంది. ఇంత ఘోరంగా పార్టీ ఓటమి పాలవుతుందని ఊహించలేకపోయిన టీడీపీ నేతలు… ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా అనంత‌పురంలో టీడీపీ పూర్తి క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అనంత‌పురం రాజ‌కీయాల్లో ప‌రిటాల‌, జేసీ ఫ్యామిలీలదే హ‌వా. ద‌శాబ్దాలుగా ఏక‌చక్రాధిప‌త్యంగా జిల్లా రాజ‌కీయాల‌ను ఏలిన‌వారు. జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత పరిటాల సునీత బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది.2005లో పరిటాల రవి హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన సునీత… అప్పటి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు.2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరిటాల సునీత… 2019లో తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు. అయితే ప‌రిటాల శ్రీరామ్ ఘోరంగా ఓడిపోవ‌డంతో భ‌విష్య‌త్తుకోసం భాజాపావైపు చూస్తున్నారు.

ఇక జేసీ కుటుంబం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.గ‌తంలో కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన జేసీ కుటుంబం విభ‌జ‌న త‌ర్వాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో అంత‌పురంనుంచి టీడీపీ త‌రుపున ఎంపీగా గెలిచారు. కాని 2019 ఎన్నిక‌ల నాటికి సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఫ్యాన్ సునీమీలో జేసీ ఫ్యామిలీలు కొట్ట‌కు పోయాయి. ఇప్ప‌టి క‌ప్పుడు టీడీపీ వ‌చ్చే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి త‌మ వారుసుల రాజ‌కీయ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని భాజాపాలో చేరేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్ల స‌మాచారం.

వీరితో పాటు వ‌ర‌దాపురం సూరి కూడా భాజాపాలో చేరుతున్నార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న భాజాపా బ‌ల‌మైన నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకొనేందుకు పావులు క‌దుపుతోంది. ఇందులో భాగంగానె ప‌రిటాల‌, జేసీ కుటుంబాల‌తో వ‌ర‌దాపురం సూరీతో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తో చర్చలు జరిపారని, ఓ తేదీని ఖరారు చేసుకుని, ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని ఆయన అనుచరగణం అంటోంది.జేసీ సోదరుల మాదిరిగానే మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. జేసీ సోదరుల మాదిరిగానే మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -