Friday, April 26, 2024
- Advertisement -

బాబుకు మొద‌ల‌యి అస‌లు సిస‌లైన ప‌రీక్ష‌…నెగ్గుకొస్తారా…?

- Advertisement -

ఊ అంటే 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం అని చెప్పుకొనే మాజీ సీఎం చంద్ర‌బాబు తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. గ‌తంలో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా పొత్తుతో నెగ్గుకొచ్చిన బాబు ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌డంతో త‌న బ‌లం ఏంటో అంద‌రికి తెలిసింది. 23 ఎమ్మెల్యే, 3 ఎంపీసీట్లు సాధించింది. దీంతో అస‌లు సిస‌లైన రాజ‌కీయ ప‌రీక్ష మొద‌ల‌య్యింది.అసెంబ్లీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఎవ‌రు ఉంటారో ఎవ‌రు ఉండ‌రో తెలియ‌ని ప‌రిస్థితి. జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నారు కొంద‌రు నేత‌లు.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న ప్ర‌భుత్వాలు రెండూ బాబుకు బ‌ద్ద శ‌త్రువులే. వైసీపీ -భాజాపా టార్గెట్ చంద్ర‌బాబె కాబ‌ట్టి … ఇద్ద‌రు క‌ల‌సి బాబును కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టేందుకు సిద్ద‌మ‌య్యారు. రాజ‌కీయంగా బాబు ను దెబ్బ‌తీయాలంటే అయ‌న కోట‌రీని బ‌ద్ద‌లు మొద‌ట బ‌ద్ద‌లు కొట్టాలి. ఆదిశ‌గా భాజాపా అడుగులు వేస్తోంది. అందుకోసం వేగంగా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే బాబుకు రైట్ హ్యాండ్‌గాఉన్న మాజీ మంత్రి అయిన సుజ‌నాచౌద‌రిని త‌మ వైపు లాక్కోవ‌డంలో బాజాపా విజ‌యం సాధించింది. సుజ‌నా చౌద‌రి ప‌రిస్థితి కూడా అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. బ్యాంకుల‌కు రుణాలు ఎగ్గొట్టిన కేసులో చిక్కుకున్నారు. ఇలాంటి సమ‌యంలో భాజాపాలో చేర‌డం మిన‌హా అయ‌న‌కు మ‌రో గ‌త్యంత‌రంలేదు.

అటు ఢిల్లీలో..ఇటు ఏపీలో చంద్ర‌బాబు మౌత్ పీస్‌గా వ్య‌వ‌హ‌రించే టీడీపీ ఎంపీ సీఎమ ర‌మేష్‌ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఆయ‌న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయితో జ‌రిపిన చ‌ర్చ‌లు అందుకు బ‌లాన్ని చేకూర్చుతున్నాయి.వైసీపీలో చేర‌లేని కొంద‌రు టీడీపీ ప్ర‌ముఖులు బీజేపీలోకి వెళ్ల‌టం దాదాపు ఖాయ‌మైంది. అందులో చంద్రబాబు మేనేజ్‌మెంట్ టీం స‌భ్యులు సైతం ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

టీడీపీ నుండి గెలిచిని ముగ్గురు ఎంపీల్లో ఒక‌రు ఇప్ప‌టికే బీజేపీలో చేరేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం అయ్యాయి. బీజేపీ ముఖ్య నేత రాం మాధ‌వ్‌తో ఇప్ప‌టికే వారి చ‌ర్చ‌లు సైతం పూర్త‌యిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27న వారు బీజేపీల చేరిక‌కు ముహూర్తం ఖ‌రారైన‌ట్లుగా స‌మాచారం..టీడీపీ నుండి గెలిచిని ముగ్గురు ఎంపీల్లో ఒక‌రు ఇప్ప‌టికే బీజేపీలో చేరేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం అయ్యాయి. బీజేపీ ముఖ్య నేత రాం మాధ‌వ్‌తో ఇప్ప‌టికే వారి చ‌ర్చ‌లు సైతం పూర్త‌యిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27న వారు బీజేపీల చేరిక‌కు ముహూర్తం ఖ‌రారైన‌ట్లుగా స‌మాచారం.

ఏపీ అసెంబ్లీలోనూ చంద్ర‌బాబుతో పాటుగా అచ్చంనాయుడు, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, క‌ర‌ణం బ‌ల‌రాం మిన‌హా మిగిలిన వారు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో విదేశీ టూర్‌కు వెల్ల‌డం ఏంటోన‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ప‌రిస్థితుల‌ను చూస్తుంటే ఏంచేయ‌లేక బాబు చేతులెత్తేసినట్టేనా….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -