Friday, April 26, 2024
- Advertisement -

మూడు సార్లు జంపింగ్ చేసినా ముచ్చ‌ట‌గా మూడో సారి ఓడిన దుర‌దృష్ట‌ నేత‌..

- Advertisement -

అదృష్టవంతుడిని ఎవరు ఆపలేరు… దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు అన్న సామెత ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నేత‌కు క‌రెక్ట్‌గా షూట‌వుతుంది. ఎంపీగా గెల‌వాల‌ని పోరాటం చేస్తున్నా ద‌రిద్రం మాత్రం అత‌న్ని వ‌ద‌ల‌డంలేదు. అయ‌న ఎవ‌రో కాదు కాకినాడ‌నుంచి టీడీపీ త‌రుపున ఎంపీగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌. ఎంత‌గా అంటె వైసీపీలో ఉండి ఉంటే ఈ సారి పార్ల‌మెంట్‌లో అడుగు పెట్టేటోడు. కాని పార్టీ ఫిరాయించి చిర‌వ‌కు రాజీకీయాల‌నుంచి త‌ప్పుకొనే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఎన్నారై అయిన చలమలశెట్టి సునీల్ 2009లో ప్ర‌జారాజ్య త‌రుపున పోటీ చేసి ఓడిపోయారు.సునీల్ భారీగా డబ్బులు వెదజల్లి ప్రజల్లోకి దూసుకువెళ్లారు. కాకినాడ లోక్‌స‌భ సీటుకు 2009లో జరిగిన ఎన్నిక‌ల్లో మాజీ కేంద్ర మంత్రి పళ్ళం రాజు చేతిలో సునీల్ స్వల్ప తేడాతో ఓడిపోయారు.

త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో వైసీపీలోకి జంప్ చేసిన సునీల్ కాకినాడ నుంచి మ‌రో సారి ఎంపీగా పోటీ చేశారు. కాని అప్పుడు కూడా అదృష్టం వ‌రించ‌లేదు. టీడీపీ టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి తోట నరసింహం చేతిలో కేవలం 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసిన సునీల్ 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం అంటే చాలా దుర‌దృష్టం అని చెప్పాలి. కాని అదే వైసీపీలో ఉండి ఉంటె జ‌గ‌న్ మేనియాతో ఇటీవ‌లి జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచేటోడు. కాని దుర‌దృష్టం వెంటాడుతోంది.

జ‌గ‌న్ ఎంత చెప్పినా విన‌కుండా చివ‌రి నిమిషంలో టీడీపీలోకి జంప్ అయ్యారు.ఈ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత చేతిలో 23 వేల ఓట్ల తేడాతో సునీల్ ముచ్చటగా మూడోసారి ఓడిపోయారు. మూడు పార్టీల నుంచి మూడు సార్లు పోటీ చేసినా సునీల్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.రాజకీయాల్లో ఫేడ్ అవుట్‌ అయిన గీత‌ చివరి క్షణంలో జగన్ ద‌య‌తో సీటు ద‌క్కించుకుని అనూహ్యంగా ఎంపీగా విజయం సాధించారు. దీంతో రాజకీయాలపై పూర్తిగా వైరాగ్యం పెట్టుకున్న ఆయన ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో కూడా లేర‌ని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -