Thursday, May 2, 2024
- Advertisement -

షోలో పవన్ ను పక్కనపెట్టిన అలీ..!

- Advertisement -

బుల్లితెరపై ఎన్ని షోస్ ఉన్నా.. సుమ చేసే క్యాష్ ప్రొగ్రాంకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ షోలో సుమ చేసే అల్లరి అంత ఇంత కాదు. ఆమె వేసే పంచులకు పగలబడి నవ్వాల్సిందే. అయితే ఈ షోలో ప్రతి వారం సెలబ్రిటీలు వచ్చి పాల్గొంటారు. తాజాగా ఈ షోలో హాస్యనటుడు అలీ, నటుడు పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీని సుమ పలు ఆసక్తికర ప్రశ్నలను అడిగింది. మొదట ఈ ఇద్దరిలో మీకెవరు ఇష్టం ? అని రెండు ఆప్షన్స్ ఇచ్చింది.

అందులో ఒకటి రాఘవేంద్రరావు పేరు కాగా.. మరొకటి పవన్ కల్యాణ్ పేరు. అలీ పవన్ పేరు చెబుతాడని అందరి భావించారు. కానీ ఆశ్చర్యంగా ఆయన మత్రం రాఘవేంద్రరావు అంటే ఇష్టమని చెప్పారు. పవన్ కి క్లోజ్ ఫ్రెండ్స్ లో అలీ ఒకరు అన్న విషయం అందరికి తెలిసిందే. అలీ లేకుండా పవన్ ఏ సినిమాలో కూడా నటించలేదు. అయితే గత ఎన్నికల సమయంలో అలీ వైసీపీలో చేరడంతో వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి అదే గ్యాప్ మెయిన్‍టైన్ అవుతుంది.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పేరును పట్టించుకోకుండా రాఘవేంద్రరావు పేరు అలీ చెప్పాడనుకోవచ్చు. ఇక క్రమంలో మరికొన్ని ప్రశ్నలు అడిగింది సుమ. పూరి జగన్నాథ్, రవితేజల్లో ఎవరంటే ఇష్టమని ప్రశ్నించగా.. రవితేజ అని చెప్పాడు అలీ. ఇక చివరలో చిరంజీవి గురించి అడిగిన ఓ ప్రశ్నను మాత్రం పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్‌లో పెట్టారు. మొత్తానికి పవన్ గురించి అలీ మాట్లాడకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అలీ, పవన్ మంచి ఫ్రెండ్స్.. రాజకీయంగా ఎన్ని ఉన్నప్పటికి పర్సనల్ గా తీసుకోవద్దని.. అలీ పై పవన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇక ఈ క్యాష్ కు సంబంధించిన లెటెస్ట్ ప్రొమోని మీరు కూడా చూసేయండి.

https://www.youtube.com/watch?v=jlAvxDWPqPo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -