Friday, April 26, 2024
- Advertisement -

కాస్టింగ్ కౌచ్‌ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్..!

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో ఆఫర్ ఇస్తామని అమ్మాయిలను వాడుకుంటున్నారని ఇప్పటికే చాలా మంది చెప్పుకొచ్చారు. హీరోయిన్స్ కూడా తమ కెరీర్ మొదలు ఎదురైన అనుభవాలను బయట పెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై జబర్దస్త్ అందాల భామ అనసూయ స్పందించింది. బుల్లితెరపై యాంకర్ గా చేస్తూనే వెండితెరపై సినిమాలు చేస్తున్న అనసూయ.. తన కెరీర్ మొదట్లు ఎదుర్కొన్న పరిస్థితులపై రియాక్ట్ అయింది.

ఎంబీఏ హెచ్‌ఆర్ చేసిన తాను ఎలాంటి ప్లాన్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని, యాంకర్‌గా స్టార్ట్ అయిన తన ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగిందని అనసూయ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్వలేదని చెప్పింది. ఇండస్ట్రీలో మీటు, క్యాస్టింగ్ కౌచ్ ఉన్నాయి కావొచ్చు. కానీ అది అమ్మాయి నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందని అనసూయ తెలిపింది. ఎవరైన ఆఫర్ ఇస్తా అంటే.. అందుకోసం ఏదైన అడిగితే.. వెంటనే ఆ ఆఫర్ వదిలేసి అంతకు మిచిన క్యారెక్టర్ వస్తుందని డ్రాప్ కావొచ్చు. అలా డ్రాప్ కాని ఆడవాళ్ళే ఈ క్యాస్టింగ్ కౌచ్‌కి బలైపోతున్నారంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది అనసూయ.

” మీ టాలెంట్ ని నమ్ముకోండి. నేనూ చాలా మిస్ అయ్యాను. ఫేవరేటిజం అనే దానికి బలయ్యాను. బట్ ఎప్పుడూ బయటకు చెప్పలేదు.. రాద్ధాంతం చేయలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి బయటపెడుతున్నా. రెండేళ్ల క్రితం ఓ గ్రూప్ ఫేవరేటిజం వల్ల నేను కూడా ఛాన్సులు కోల్పోయాను. అయినా నా టాలెంట్‌నే నేను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నా. ఈ క్యారెక్టర్ అనసూయ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేంతలా కష్టపడాలి. లైఫ్‌లో ఆ టార్గెట్ పెట్టుకుంటే కాస్టింగ్ కౌచ్‌ కాదు కదా.. క్యాస్టింగ్ పిల్లో కూడా రాదు” అని అనసూయ చెప్పుకొచ్చింది.

ఛాన్స్ ఇస్తానని అమ్మా రాజశేఖర్ నన్ను వాడుకున్నాడు : జబర్తస్త్ పవన్

నా భర్త పెద్ద సైకో.. నన్ను టార్చర్ పెడుతున్నాడు : స్వాతి నాయుడు

ఏమీ పీకలేక.. పీకే మీద పడి ఏడుస్తున్నావ్ : వర్మపై మాధవీలత ఫైర్

బిగ్ బాస్ 4 కోసం పూనమ్‌ బజ్వా ఎంత తీసుకుంటుందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -