Saturday, April 27, 2024
- Advertisement -

సురేఖ, హేమ.. తమ కూతుర్ళతో క్యాష్ షోలో రచ్చ..!

- Advertisement -

యాంకర్ సుమ హోస్ట్ చేసే పాపులర్ షో క్యాష్‌లో సీనియర్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్‌‌లు హేమ, సురేఖ వాణిలు తమ కూతుళ్లతో సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. బుట్ట బొమ్మ సాంగ్‌కి యాంకర్ సుమతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. సురేఖా వాణి కూతురు సుప్రిత, హేమ కూతురు ఇషాలు ఈ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇంతకీ మిమ్మల్ని అక్కా అనాలా? ఆంటీ అనాలా? ఫ్రెండ్ అనాలా? అని యాంకర్ సుమని సురేఖ వాణి కూతురు సుప్రిత అమాయకంగా అడగ్గా.. ‘ఏదోటి అనమ్మా’? అంటూ తనదైన శైలిలో చెప్పింది సుమ.

మీరు ఈ జనరేషన్‌ని ఆ జనరేషన్‌ని కవర్ చేసేలా ఉన్నారని సురేఖ వాణి.. సుమని ఉద్దేశించి అనగా మీరు ఆ తరువాత జనరేషన్‌ని కూడా కవర్ చేస్తారని పంచ్ పేల్చింది. ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు లేజీగా ఉంటారని సుమ అడగడంతో.. ‘మా అమ్మ.. అస్సలు పనిచేయదు’ అని సురేఖ వాణి కూతురు అనడంతో.. ‘హమ్మ బాబోయ్.. జనాలు నిజం అనుకుంటారే’!! అంటూ సురేఖా వాణి నవ్వేసింది. ఇక సుమ వీరితో బాస్కెట్ బాల్ ఆడిస్తూ.. గోల్ పడని వాళ్లతో బ్రేకింగ్ న్యూస్ ఆట ఆడుకుంది. బోయపాటి, అనీల్ రావిపూడిలు ఆఫర్ ఇస్తే ఎవరితో చేస్తారని సుమ అడగ్గా బోయపాటితో చేస్తా అని ఆన్సర్ ఇచ్చింది సురేఖ వాణి. దీన్ని బ్రేకింగ్‌గా చదివి ఓ ఆట ఆడుకుంది సుమ.

ఇక సురేఖ వాణి కూతురు సుప్రితకు సుమ ఓ డైలాగ్ ఇచ్చి డైలాగ్ చెప్పమనగా.. సురేఖ వాణి కల్పించుకుని ‘హీరో బాగున్నాడా’ అని అడుగడం.. దానికి సుప్రిత దరిద్రంగా ఉన్నాడని చెప్పడంతో ‘హీరో బాలేకపోతే మా అమ్మాయి డైలాగ్ చెప్పదు’ అంటూ పంచ్ వేసింది.చివర్లో అమ్మ గురించి ఓ రెండు మాటలు చెప్పాలని సుప్రిత, ఇషాలను సుమ అడగడంతో చాలా ఎమోషనల్‌గా చెప్పారు. ‘మేం ఇద్దరం ఒక్కటే నేను ఎంత చెత్త పనిచేసినా.. నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండ్ వీక్ నెస్ కూడా అమ్మే’ అంటూ ఎమోషనల్ అయ్యింది సురేఖ వాణి కూతురు సుప్రిత. ఇక హేమ కూతురు ఇషా మాట్లాడుతూ.. ‘నాకంటే ఇంట్లో మా అమ్మే ఎక్కువ అల్లరి చేస్తుంది. అమ్మ నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది.. కోపం వస్తే కరుస్తా అంటూ సెట్‌లో హేమమ్మ బుగ్గ కొరికింది ఈ ముద్దుల కూతురు. మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి.

వర్మ ‘మర్డర్’ సినిమా ఘాటుగా స్పందించిన అమృత..!

కమెడియన్ విద్యుల్లేఖ ఎంత సన్నబడిందో చూడండి..!

గొప్ప మనసు చాటుకున్న మహేష్.. చిన్నారికి ప్రాణం పోశాడు..!

గంగోత్రి హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -