నాకు పెళ్లి కాలేదు.. కానీ శీలాన్ని కోల్పోయా : శ్రీరెడ్డి

1606
Here Is What Sri Reddy Says About Rana Marriage
Here Is What Sri Reddy Says About Rana Marriage

కాస్టింగ్ కౌచ్ ను బయటపెట్టి.. నగ్నంగా ‘మా’ ఆఫీసు ముందు రచ్చ చేసి సంచలనంగా మారి.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వెళ్లి అక్కడ సెటిల్ అయింది నటి శ్రీరెడ్డి. ఈమె సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక సెలబ్రిటీపై విరుచుకుపడుతూనే ఉంటుంది.

తాజాగా రానా-మిహికా బజాజ్ ఒక్కటవ్వడంపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ చేసింది. ‘నీ లైఫ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారూ.. ఈ అమ్మాయితో ప్రశాంత జీవితం కొనసాగించాలి’ని పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి ఇలా పాజిటివ్ గా స్పందించేసరికి అందరూ షాక్ అయ్యారు. తర్వాత మరో పోస్టులో ’రామానాయుడు స్టూడియోలో రానా బావా ఎంగేజ్ మెంట్.. తరువాత నాదే’ అంటూ తనదైన మరో పోస్ట్ పెట్టి రచ్చ చేసింది. శ్రీరెడ్డి ఈ పోస్టులో రానాను బావా అంటూ పిలవడం చర్చనీయాంశమైంది.

ఇక తాజాగా మరో పోస్టు వైరల్ అవుతోంది. “నాకు కనీసం ఒక్కసారి కూడా పెళ్లి కాలేదని.. కానీ శీలాన్ని కోల్పోయానని.. ఎవరైనా దీనిపై ఫేక్ న్యూస్ వార్తలు రాస్తే అతన్నే పెళ్లి చేసుకుంటానని’ సెటైర్లు వేస్తూ హాట్ కామెంట్ చేసింది. ఇలా తన గురించి.. రానా కొత్త జీవితం గురించి హాట్ కామెంట్స్ చేసి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది.

Loading...