Friday, April 26, 2024
- Advertisement -

నాగబాబు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు.. నటుడిగా నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసాడు. జబర్దస్త్ షోకి జడ్జిగా ఉంటూ మరింత ఎక్కువ మందికి దగ్గర అయ్యాడు. రాక్షసుడు సినిమాతో నటుడిగా నాగబాబు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా చేసినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ మొదలు పెట్టి.. రుద్రవీణ సినిమాని నిర్మించాడు.

కానీ కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద సక్సెస్ కాలేదు. తర్వాత త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు..బాగున్నారా వంటి సినిమాలు నిర్మించాడు. బావగారు బాగున్నారా మంచి హిట్ అయింది. పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబుకు కలిసి రాలేదు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు పాపులారిటీ పెరిగింది.

అదే టైంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడంతో నాగబాబు ఆర్థికంగా నిలబడ్డాడు. మొన్నటి ఎన్నికల్లో నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తరుపున రాజకీయాల్లో ప్రవేశించాడు. అంతేకాదు నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసారు. కానీ గెలవలేదు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు, తన భార్యకు కలిపి రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చూపించారు. ఇందులో వాహనాలు వంటి చరాస్థులు రూ.36.73 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.

ఇక స్థిరాస్థుల విషయానికొస్తే రూ.4.22 కోట్లుగా చూపించారు. దీంతో పాటు రూ.2.70 కోట్ల అప్పు ఉన్నట్లు చూపించారు. మొత్తంగా చూస్తే.. నికరంగా రూ.38 కోట్లు ఆస్తులున్నాయి. అదే మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే.. రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -