రచ్చ రవి యాక్సిడెంట్ గురించి చెప్పిన నాగబాబు..!

1884
Mega Brother Nagababu says sensational facts behind Rach Ravi Accident
Mega Brother Nagababu says sensational facts behind Rach Ravi Accident

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ మానేసి మరో ఛానెల్ లో ప్రసారం అవుతున్న షోకి వెళ్లిపోయారు. అయితే ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా జబర్దస్త్ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పారు. ఇక గతంలో జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర టీం లో రచ్చ రవి చేశేవాడు. అక్కడ నుంచి మంచి పేరు తెచ్చుకుని.. కొన్ని రోజుల తర్వాత టీం లీడర్ అయ్యాడు రవి. ఏ పాత్రైన ఒదిగిపోయి నటిస్తాడు రవి.

కొన్ని కారణాల చేత జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన రచ్చ రవి.. ఆ తర్వాత వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే అప్పట్లో జరిగిన ఓ ఇష్యూ గురించి నాగబాబు తాజాగా చెప్పుకొచ్చారు. జబర్దస్త్ షో చేస్తున్నపుడే రచ్చ రవికి యాక్సిడెంట్ అయింది. అందులో మనోడికి గాయాలు కూడా బాగానే అయ్యాయి. జబర్దస్త్ టీం అంతా కలిసి రవికి ఆర్థిక సాయం కూడా చేసారు.

ఇప్పుడు ఆ ప్రమాదం గురించి మనసు విప్పి మాట్లాడాడు నాగబాబు. తాము జబర్దస్త్ షో చేస్తున్న సమయంలోనే రవికి యాక్సిడెంట్ అయిందనే వార్త వచ్చిందని.. వెంటనే అతన్ని అక్కడే దగ్గర్లో ఉన్న అపోలోలో జాయిన్ చేసారని.. అప్పుడు తాను వెళ్లి చూసానని చెప్పాడు నాగబాబు. మీరు వచ్చి చెప్తే ఇంకాస్త బెటర్ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పడంతో.. తాను వెంటనే వెళ్లి హాస్పిటల్లో చెప్పినట్లు గుర్తు చేశారు.

రవి యాక్సిడెంట్ తర్వాత జబర్దస్త్ కమెడియన్స్ కోసం ప్రత్యేకంగా ఓ సహాయనిధి ఏర్పాటు చేశాడు నాగబాబు. ఎవరికి సాయం కావాల్సి వచ్చినా కూడా అప్పట్నుంచి అంత కలిసి డబ్బులు ఇవ్వడం అలవాటు చేసుకున్నారని నాగబాబు చెప్పారు. జబర్దస్ వల్ల మరిచిపోలేని ఎన్నో అనుభూతులు ఉన్నాయని నాగబాబు చెప్పాడు.

Loading...