Saturday, April 27, 2024
- Advertisement -

సమంతకి చైతు వార్నింగ్ ఎందుకు ?

- Advertisement -

మాములుగా సినీ పరిశ్రమలో ఏ హీరోయిన్ అయిన స్టార్ హీరోయిన్ గా ఉంటూ.. బిజీగా సినిమాలు చేసుకుంటూ ఉంటే ఆ హీరోయిన్ పొరపాటున కూడా పెళ్లి అనే ముచ్చటను తన వద్దకు రానివ్వదు. కెరీర్ లో ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అంటూ అసలు పెళ్లి ఊసే ఎత్తరు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి సినిమాల్లో హీరోయిన్స్ గా ఛాన్సులు తగ్గిపోతాయి కాబట్టి.

హీరోయిన్ కి పెళ్ళి అయిందంటే మేకర్స్ దూరం పెట్టేస్తారు. కానీ సమంత మాత్రం కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే అక్కినేని హీరో నాగ చైతన్యని పెళ్లి చేసుకుంది. దాంతో అందరు సమంత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందని అనుకున్నారు. కాని అందరికీ షాకిచ్చి మజిలీ, ఓ బేబి, జాను వంటి మంచి సినిమాలు చేయడంతో పాటు మంచి పాత్రలు చేస్తుందని అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ప్రస్తుతం మజిలీ, జాను వంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుందట సమంత.

ఇదే విషయంను భర్త నాగ చైతన్యకు చెప్పిందంట. అయితే చైతు ఈ విషయంలో సమంతకు వార్నింగ్ ఇచ్చాడట. నీకేమైనా పిచెక్కిందా. నిజంగా సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నావా ..! అంటూ ఆశ్చర్యంగా అడిగాడట. పెళ్లి తర్వాత సినిమాలకు చేయడానికి కారణం చైతు అని.. పెళ్లి తర్వాత ఎవరైనా బ్రేక్ తీసుకుంటే వారు మళ్లీ హీరోయిన్ గా కొనసాగిన సందర్భాలు లేవని.. అందుకే పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేయమని చైతు సపోర్ట్ చేశాడని సమంత చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -