Friday, April 26, 2024
- Advertisement -

చరణ్ ను కొట్టిన చిరు.. ఎందుకు ?

- Advertisement -

చిరంజీవి రామ్ చరణ్.. అన్నదమ్ములా, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. తండ్రీ కొడుకులు అసలు అంటే నమ్మడం కష్టమే. ఇండస్ట్రీలో చాలా మంది వీరిని ఆదర్శంగా తీసుకుంటుంటారు. ఇద్దరు పోటాపోటీగా సినిమాలు తీస్తూ అభిమానులను ఖుషీ చేస్తూ చేస్తున్నారు. అయితే చరణ్ తన లైఫ్ లో కేవలం ఒక్కసారి మాత్రమే చిరంజీవి కొట్టాడట. అది కూడా చెర్రీకి 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడట. ఒక్కగానొక్క గారాల కొడుకు కావడంతో ఆ తర్వాత ఎప్పుడు చరణ్ మీద చేయి చేసుకోలేదట.

ఈ విషయాన్ని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘నా చిన్నతనంలో మా ఇంటి గేట్ దగ్గర మా డ్రైవర్ సెక్యూరిటీ మాట్లాడుకోవడం విన్నాను. నాకు వారు మాట్లాడుకున్న దానికి మీనింగ్ తెలియదు. దీంతో నేను వెళ్లి బాబాయ్ నాగబాబుని ఆ మాటలకు అర్థం ఏమిటని అడిగాను. అదే సమయంలో నాన్నగారు షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చారు. నాగ బాబాయ్ నాన్నని రూమ్ లోకి తీసుకెళ్లి చెర్రీ బ్యాడ్ వర్డ్స్ నేర్చుకుంటున్నాడు అని కంప్లైంట్ చేసాడు. వెంటనే రూమ్లో నుంచి బాబాయిని పంపిన నాన్న.. కోపంతో మా తాత గిఫ్ట్ గా ఇచ్చిన బెల్ట్ తీసుకొని నన్ను కొట్టారు.

అవి మంచి మాటలు కాదని.. ఎప్పుడూ అలాంటివి మాట్లాడకని తరువాత చెప్పారు. ఈ ఘటన తరువాత నాగబాబు బాబాయితో నేను చాలా రోజుల వరకు మాట్లాడలేదు. ఆ తర్వాత నాన్న నా మీద ఎప్పుడు చేయి చేసుకోలేదు’ అని చెర్రీ తెలిపారు. అయితే ఇప్పటికీ నాన్నతో ఏదైనా చెప్పాలంటే ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఉపాసన మాత్రం ఫ్రీ గా నాన్నగారితో మాట్లాడేస్తుంది. నాన్న ఉపాసన మామా కోడళ్ళులా కాకుండా స్నేహితులుగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను ఓకే చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -