Friday, April 26, 2024
- Advertisement -

అప్పుడు కౌశల్.. ఇప్పుడు రాహుల్.. విన్నర్ ఫార్ములా..!

- Advertisement -

బిగ్ బాస్ చివరి దశలో ఉండటంతో సోషల్ మీడియాలో ఇంటి సభ్యుల అభిమానులు హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు.. రాహుల్, శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్, వరుణ్ ఉన్నారు. రాహుల్ టికెట్ టు ఫినాలె అందుకుని మొదటగా టాప్ పైవ్ లోకి వెళ్లాడు. ఆ తర్వాత బాబా భాస్కర్ వెళ్లారు. శివజ్యోతి ఎలిమినేట్ తర్వాత మొత్తం ఐదుగురు మిగిలారు. ఇక శ్రీముఖి విన్నర్ అని ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. శ్రీముఖి సోదరుడు స్పందిస్తూ.. అది ఫేక్ ఫోటో అని తేల్చేశాడు.

ఇక బిగ్ బాస్ లో నిజాయితీగా ఉన్న వ్యక్తిగా రాహుల్ పేరు తెచ్చుకున్నాడు. ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల అతనికి ఎంతో మంది అభిమానులు అయ్యారు. బిగ్ బాస్ రెండో సీజన్ లో కౌశల్ ఆడిన విధానానికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. అప్పట్లో కౌశల్ పేరిట ర్యాలీలు కూడా తీశారు. అందరు ఒక్కటై.. అతనిని ఒంటరి చేయడం వల్ల అతనిపై ప్రేక్షకుల్లో సింపతి కూడా పెరిగి వర్కౌట్ అయింది. నామినేషన్ విషయంలో కూడా కౌశల్ నే అందరు టార్గెట్ చేయడం అతనికి బాగా కలిసి వచ్చింది. అదే అతడ్ని లాస్ట్ కు విన్నర్ ను చేసింది.

అందరి కంటే ఎక్కువ (11) సార్లు నామినేషకు వెళ్లింది కౌశలే. అదే ఫార్ములా ఇప్పుడు రాహుల్ విషయంలో జరుగుతోంది. శ్రీముఖి పదే పదే రాహుల్ ను టార్గెట్ చేయడంతో అతనిపై అందరికి సింపతి వచ్చింది. రాహుల్ నామినేషకు వెళ్లడం తిరిగి రావడంతో.. ఒకొనొక సందర్భంలో శ్రీ,ముఖివెనక్కి తగ్గింది. రాహుల్ కూడ ఈ సీజన్ లో 11సార్లు నామినేట్ అయ్యాడు. ఇదే విషయంను పోల్చుతూ రాహుల్ విన్నర్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -