యాంకర్ సుమకు ఛాన్స్ లు ఇవ్వడం లేదు.. ఎందుకో తెలుసా ?

9948
Shocking remuneration For Suma
Shocking remuneration For Suma

టాలీవుడ్, తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ తనధైన శైలీలో రాణిస్తోంది. సుమ మలయాళి అమ్మాయి అయినప్పటికి.. తెలుగులో మాత్రం చాలా చక్కగా మాట్లాడుతోంది. ఆమె యాంకరింగ్ చేస్తే ఎవరైన ఫిదా కావాల్సిందే. అన్ని భాషల్లో పట్టున్న సుమ ఇప్పటికి నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది.

ఈవెంట్స్, రియాలిటీ షోలు, గేమ్‌లు, ఇలా ఒకటేంటి.. ప్రతిదీ చేస్తోంది సుమ. ఇప్పుడు ఎందరో అందమైన యాంకరమ్మలు వచ్చినా.. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరూ కూడా సుమకే ఓటేస్తారు. అయితే కొద్దిరోజులుగా సుమ చేస్తున్న రకరకాల డిమాండ్లతో నిర్మాతలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సుమ రెండు గంటల వ్యవధి ఉన్న ఒక్కో షోకు మూడు నుంచి ఐదు లక్షల వరకు డిమాండ్ చేస్తోందట. దీనికి జీఎస్టీ అదనం. దాంతో టాలీవుడ్ నిర్మాతలకు తడిసి మోపడవుతోందని సమాచారం. అందుకే సుమను పక్కన పెట్టి.. ఆమె కన్నా తక్కువకే హోస్టింగ్ చేసే మిగతా వారితో సరిపెట్టుకోవాలని చూస్తున్నారట. ఇక చిన్న సినిమాలకు కూడా ఇదే విధంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్ల ఆమెను పక్కను పెడుతున్నారట.

Loading...