Friday, April 26, 2024
- Advertisement -

శివబాలాజీ దగ్గర ఎంత ఆస్తి ఉందంటే..?

- Advertisement -

బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ గా శివబాలాజీ నిలిచారు. దాంతో శివబాలాజీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చేస్తున్న శివబాలాజీ.. 70 రోజుల తెలుగు బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిపోయాడు. ఎంతగా మెప్పించాడు కాబట్టే ప్రేక్షకులు అతన్ని గెలిపించారు. తనకు ఉన్న సహజ లక్షణమైన కోపం కారణంగా ఎలిమినేట్ అయిపోతాడని చాలా మంది అనుకున్నారు.

ఊహించని విధంగా ఫైనల్ వరకు వచ్చిన నటుడు శివ బాలాజీ.. అదేవిదంగా టైటిల్ ఎగిరేసుకు పోవడం లో సక్సస్ సాధించాడు. బిగ్ బాస్ విజేత ఎవరు అని తెలుసుకోవడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఫైనల్ విన్నర్ శివ బాలాజీ అని తెలియగానే త్రిల్ ఫీలయ్యారు. అసలు శివ బాలాజీ ఎవరంటే.. తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మనోహర రామస్వామి, శివకుమారి దంపతులకు పెద్ద కుమారుడు శివ బాలాజీ. అక్టోబరు 14, 1980లో జన్మించాడు. వారి ఆస్తుల విలువ మూడు నాలుగు వందల కోట్ల వరకు ఉంటుందట. బిజినెస్ ఫ్యామిలీ కావడంతో శివబాలాజీ మొదట వ్యాపారం చేశాడు. కానీ సినిమాలపై ఆసక్తిగా ఉండటంతో.. సినీ ఇండస్ట్రీకి వచ్చారు. తర్వాత నటి మధుమిత ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. 2002 లో వచ్చిన ‘ఇది అశోక్ గాడి లవ్ స్టోరి’ అనే సినిమా తో హీరోగా అడుగుపెట్టాడు.

కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఆర్యలో నెగిటివ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సంక్రాంతి మూవీలో వెంకటేష్ కి తమ్ముడిగా చేసి మంచి మార్కులు కొట్టేశాడు. శివ 17 ఏళ్ళ వయసు నుంచే శివ తన తండ్రి వ్యాపారాలను చూసుకోవడం మొదలు పెట్టాడు.శివబాలాజీ 17 ఏళ్ళ వయసు నుంచే తనతండ్రి నుంచి సంక్రమించిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టాడు. 20 సంవత్సరాల వయసుకే తన సొంత కంపెనీలు స్థాపించాడు. తర్వాత శివ బాలాజీ తండ్రి.. సినిమా లేదా.. వ్యాపారం ఏదో ఒకటి చేయ్యి అనడంతో.. శివబాలాజీ.. సినిమా రంగం వైపు వచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -