Friday, April 26, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ కొంత ఇంటి ఖరీదు ఎంతో తెలుసా ?

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవలే కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఎంతో హ్యాపీగా ఉందని.. కొత్త ఇంటిని కొని ఇంటివాడినయ్యాని విజయ్ తెలిపాడు. తల్లిదండ్రులు తమ్ముడితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ ఆ ఇంటికి ఎంత ఖర్చు అయిందన్న విషయం మాత్రం చెప్పాలేదు. ఇల్లు మాత్రం అద్భుతంగా ఉంది. మరి విజయ్ ఆ ఇంటికి ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్ష‌రాల 15 నుంచి 20 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తోంది.

విలాసవంతంగా నిర్మించిన ఇంటిలోపల, బయట సకల సౌకర్యాలు ఉన్నాయట. విజయ్ స్టైల్ కి తగ్గట్లు తన ఇంటిని అంతే ప్రత్యేకంగా ఇంటరియల్ డిజైన్ చేయించుకున్నట్లు చూసిన వాళ్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు విజయ్ గ‌తాన్ని గుర్తు చేస్తూ సంతోష‌ప‌డుతున్నారు. ఓవ‌ర్ నైట్ లో స్టార్ అయ్యావు…అంతే స్పీడ్ గా 20 కోట్లు పెట్టి ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసావు.

ఇది నిజంగా గొప్ప విష‌యం అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి విజయ్ నీ పెళ్లి ఎప్పుడు అని నెటిజన్లు సొషల్ మీడియా ద్వారా విజయ్ ని అడుగుతున్నారు. ఇక ప్ర‌స్తుతం విజ‌య్, క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్ రామారావు నిర్మిస్తోన్న వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌వ్వ‌గానే పూరి జ‌గ‌న్నాథ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఇంకా మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు అతని చేతిలో ఉన్నాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -