Friday, April 26, 2024
- Advertisement -

మహేష్ బాబు మూవీలో విజయ్ దేవరకొండ ?

- Advertisement -

మహేష్ బాబు ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. మహేష్ తన కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమాతో సాధించాడు. ఇక తన తరువాతి చిత్రాన్ని మరోసారి ‘మహర్షి’ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మహేష్ కు 27 వ చిత్రం. ఇక ఈ సినిమాలో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఓ కీలకపాత్ర పోషించబోతున్నాడట. ఈ విషయం పై విజయ్, మహేష్ లతో దర్శకుడు వంశీ పైడిపల్లి.. డిస్కషన్లు జరపడం.. అందుకు ఇద్దరూ ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందట. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుందట. అయితే మహేష్ స్పై గా కూడా కనిపించబోతున్నాడు అనే వార్త కూడా ప్రచారంలో ఉంది.

ఇక విజయ్ దేవరకొండ పాత్ర ఈ చిత్రంలో అత్యంత కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే విజయ్, మహేష్ పలు ఈవెంట్ లకు కలుసుకోవడం చూశాం. ఇప్పుడు వెండితెరపై ఒకేసారి ఈ ఇద్దర్ని చూస్తే ఆ కిక్కే వేరు. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -