Friday, April 26, 2024
- Advertisement -

రానా, మిహీక ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకున్నారో తెలుసా ?

- Advertisement -

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తన ప్రేమ విషయంను చెప్పి సర్ ఫ్రైజ్ చేశాడు. వ్యాపార‌వేత్త మిహీకా బ‌జాజ్‌తో ‌ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఆయన చెప్పాడు. చాలా విషయాల్లో గోప్యత పాటించే రానా ఒక్కసారిగా తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేయడంతో అభిమానులు షాక్‌ అయ్యారు. ఇక రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో మొత్తం రానా ప్రేమ గురించే హాట్ టాపిక్.

రానా ఒక ఇంటివాడు కాబోతున్నాడ‌ని తెలిసిన వెంట‌నే ప్ర‌ముఖులంతా విషెస్ తెలియజేశారు. అయితే రానా, మిహీకకు మ‌ధ్య‌ ప్రేమ ఎక్క‌డ చిగురించింద‌ని అభిమానులు ఆలోచ‌న‌లో ప‌డిపోయారు. ఇద్ద‌రు హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తులు అయినన‌ప్ప‌టికీ వీరి ల‌వ్ ట్రాక్ ఏర్ప‌డ‌టానికి కారణం మాత్రం ముంబై అని తెలుస్తోంది. రానా సన్నిహితుల సమాచారం మేరకు.. రానా, మిహీకా ముంబైలో జ‌రిగిన ఓ బాలీవుడ్ పార్టీలో కలుసుకున్నారట. అలా కలుసుకున్న వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారిందట.

నేడు వివాహం బంధంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇక వీరి ప్రేమ విషయంపై స్పందించిన సురేష్ బాబు.. రానా మిహికల‌కు చాలా కాలం నుంచి ప‌రిచ‌యం ఉన్న‌ట్లు తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాదిలోనే రానా పెళ్లి పీట‌లు ఎక్కునున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక త్వరలోనే ద‌గ్గుబాటి వార‌సుడి పెళ్లి బాజాలు మోగ‌నున్న‌న్నాయి. ఇక మిహికా బజాజ్ హైదరబాద్ అమ్మాయే. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటుంది. అక్కడే ’డ్యూ డ్రాప్ స్లూడియో’ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -