Friday, April 26, 2024
- Advertisement -

ముంచుకొస్తున్న ‘పెథాయ్’ తుపాన్‌

- Advertisement -

పెథాయ్ తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రమైంది.శ‌నివారం ఉద‌య‌నికి పెథాయ్ తుపాన్ మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 720, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 760కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపానుగా మారిన తర్వాత 16వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో పెథాయ్‌.. తీవ్ర తుపానుగా మారుతూ.. వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం శుక్రవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది.తీవ్ర వాయుగుండం, తుపాను ప్రభా వం వల్ల శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తాంధ్రలో చెదురు మదురుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

తదుపరి రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో చెరుదుమదురుగా వర్షం పడుతుంది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. పెథాయ్‌ తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతోనూ కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.సోమ‌వారం మధ్యాహ్నం ఒంగోలు, కాకినాడ మధ్యలో పెథాయ్‌ తీరందాటే అవకాశం ఉందని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -