Friday, April 26, 2024
- Advertisement -

కాబోయే భ‌ర్త‌ను బేరంపెట్టి అమ్మేసిన యువ‌తి

- Advertisement -

సమాజంలో రోజుకి రోజుకి వింత ప‌రిణమాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో మ‌గ‌వారు చేసే ప‌నులు అన్నింటిని ఇప్పుడు అమ్మ‌యిలు ఏ బేరుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అమెరికాలోని ఓ యువ‌తి ఓ అబ్బాయిని ప్రేమించింది. అబ్బాయిది చాలా సంపన్న కుటుంబం కావ‌డంతో వీరి పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయిన‌ప్ప‌టికి ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ అమ్మాయి మంచిది కాదు, ఆమెతో పెళ్లి వ‌ద్ద‌ని అబ్బాయిని మార్చే ప్ర‌య‌త్నం చేశారు వారి కుటుంబ స‌భ్యులు. ఈ క్ర‌మంలో అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌లో కొన్ని మార్పులు రావ‌డం ఆమె గ‌మ‌నించింది.

ఆమెపై యువతిపై ఆంక్షలు విధించేవాడు. ఇలా ఉండు, ఇలా ఉండు, ఇది చెయ్యి, అలా చెయ్యి,అంటూ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె అత‌నితో క‌లిసి జీవించ‌లేక‌పోయింది. అత‌ని టార్జ‌ర్ తట్టుకోలేక యువతి అతనిని వదిలేద్దామని నిర్ణయం తీసుకుంది.ఆ సమయంలోనే ఆ యువ‌కుడి తల్లి ఆమె కాల్ చేసి త‌న కొడుకుని వ‌దిలిస్తే 10వేల డాలర్లు ఇస్తానని ఆఫ‌ర్ చేసింది. ఎలాగు అత‌ని నుంచి విడిపోవాల‌ని డిసైడ్ ఆమెకు మ‌నీ ఆఫ‌ర్ రావ‌డంతో ఆ డబ్బు తీసుకొని బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది. కాబోయే భ‌ర్త‌ను సొంత తల్లిదండ్రులకే అమ్మిసిన ఘ‌న‌త ఆమెకే ద‌క్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -