Thursday, May 9, 2024
- Advertisement -

అసెంబ్లీ ఫర్నీచర్ మాయం.. ఇరుక్కున్న కోడెల

- Advertisement -

పాపం కోడెల.. ఒకటి కాదు.. రెండు కాదు.. స్పీకర్ పోస్టునుంచి దిగిపోయి టీడీపీలో ఓడిపోయాక ఆయనపై వచ్చిన అలిగేషన్స్ అన్నీ ఇన్నీ కావు.. ‘కేటాక్స్’ పేరిట ఆయన వసూళ్ల దందా కూడా బయటపడింది. బాధితులు పోలీస్ స్టేషన్ల గడప తొక్కడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుమారుడు, కూతురు సహా కోడెలను కేసులు చుట్టముట్టాయి..

కాగా మరో వివాదంలో కోడెల శివప్రసాద్ చిక్కుకున్నాడు. మంగళవారం ఏపీ అసెంబ్లీ ఫర్నిచర్ మాయం అంటూ మీడియాలు కథనాలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించిన అసెంబ్లీ ఫర్నిచర్ లో కొంత మాయమైందని.. అది కోడెల నివాసంలో ఉందని వార్తలొచ్చాయి.

ఈ వార్తలపై తాజాగా కోడెల వివరణ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అమరావతికి సామాన్లు తరలించేటప్పుడు తాను కొంత ఫర్నిచర్ ను వినియోగించుకున్నానని కోడెల శివప్రసాద్ సంచలన విషయం చెప్పి ఇరుక్కున్నారు. ఆ ఫర్నిచర్ ను తీసుకెళ్లాలని అసెంబ్లీ అధికారులకు లేఖ కూడా రాసినా వాళ్లు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఆ ఫర్నీచర్ ను అప్పగించేందుకు రెడీ అని.. ఒకవేళ ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లాస్తానని కోడెల వివరణ ఇచ్చారు.

దీంతో అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల కొట్టేశాడని వైసీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. విషయం వెలుగులోకి రాకపోతే వాటిని అనుభవించేవాడని.. తెలియడంతోనే కలుగులోంచి ఎలుకలా బయటకు వచ్చి విషయం చెప్పాడని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -