Thursday, May 2, 2024
- Advertisement -

రెండో రోజు మారని టీడీపీ ఎమ్మెల్యేల తీరు!

- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార వైసీపీ , టీడీపీ మధ్య మాటల యుద్దం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ పై సభలో చర్చించేందుకు సిద్ధమని వైసీపీ ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ ఆపలేదు. చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా ఇరువర్గాల ఎమ్మెల్యేల మధ్య గొడవతో పలుమార్లు వాయిదా వేశారు స్పీకరి తమ్మినేని. ఇక ఏపీ అసెంబ్లీ నుంచి ఇవాళ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. అచ్చెన్నాయుడు, అశోక్ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు వేశారు. సభలో వీడియో తీసినందుకు స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఇక నిన్న ముగ్గురిని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక అసెంబ్లీ లాబీల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. మీకు ఇదే చివరి సభ అంటూ బుచ్చయ్య చౌదరితో అనిల్ మాట్లాడగా నాకు కాదు మొత్తం మీ పార్టీకి ఇదే చివరి శాసనసభ అంటూ కౌంటర్ ఇచ్చారు గోరంట్ల బుచ్చయ్య.

చంద్రబాబు అరెస్ట్ పై ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని మరోసారి తేల్చిచెప్పారు మంత్రి అంబటి రాంబాబు. గతంలో ఎప్పుడు ఇంత యాక్టివ్ గా‌ బాలకృష్ణ లేడు. బావ కళ్ళలో‌ ఆనందం కోసం.. మీసం మీ పార్టిలో తిప్పండి…శాసనసభ లో‌కాదు. మీ తండ్రి వెన్నులో కత్తి దిగిన సంగతి గుర్తు తెచ్చుకో బాలకృష్ణ అంటు చురకలు అంటించారు అంబటి. బాలకృష్ణకి ఇది మంచి అవకాశం. ఎన్టీఆర్ కుమారులు తండ్రికి ద్రోహం చేశారని అపవాదు ఉంది. మీకొక సూచన.. పగ్గాలు తీసుకోండి మీ ప్రతాపం చూపండి అని సూచించారు. ఇక బాలకృష్ణ సభలో విజిల్ వేస్తూ రచ్చరచ్చ చేశారు. టీడీపీ నేతలు చర్చకు రమ్మంటే బయపడి పారిపోతున్నారని…చంద్రబాబు అవినీతి చేసింది వారికి తెలుసన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -