వారం రోజుల ఏపీ శాసన సభ హైలైట్స్

- Advertisement -

ఏపీ శాసన సభ నిరవదిక వాయిదా పడింది. వారంరోజుల పాటు సాగిన అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ యుద్ధంలో మొదట అచ్చెన్నాయుడు-వైసీపీ నేతల మధ్య వార్ కొనసాగింది. అసెంబ్లీ సమావేలు ప్రారంభమైన మొదటి రోజు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కాలేదు. ఆ రోజు అసెంబ్లీలో మహిళల భద్రతపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి రాక పోవడం చంద్రబాబుకు సిగ్గు చేటుగా అనిపించడం లేదా ? అని స్వయంగా సీఎం అసెంబ్లీ వేదికగా విమర్శించారు.

అనంతరం అసెంబ్లీ మావేశాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలౌతున్న పథకాల గురించి చర్చ జరుగుతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు… మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు ? అనే ప్రశ్న వేశారు. అంతటితో ఆగకుండా పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌ను చుట్టుముట్టారు. దీంతో సభ పలు మార్లు వాయిదా పడింది. ఆ సమయంలోనే వైసీపీ నేతలు తన సతీమణినిపై నీచంగా మట్లాడారని చంద్రబాబు స్పీకర్‌కు నమస్కారం చెప్పి తాను మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో కాలుపెడుతానని సభను భహిష్కరించి వెళ్లారు.

- Advertisement -

మరోవైపు వారంరోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం 26 కీలక బిల్లులు ప్రెట్టింది. సభ 35 గంటల పాటు కొనసాగినట్లు అధికారులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఎక్కడ..? మౌనం ఎందుకు..?

సీఎం ఢిల్లీలో ఏంపీకారు చెప్పాలి..

బాబు సంస్కారానికి జగన్ నమస్కారం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -