Friday, April 26, 2024
- Advertisement -

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్యం విషమం!

- Advertisement -

దేశంలో గత కొంత కాలంగా కరోనా విజృంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా భారిన సామాన్యులే కాదు… సెలబ్రెటీలకు నిద్రపట్టకుండా చేస్తుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయన నేతలు పలువురు క్రీడాకారులకు కరోనా పాజిటీవ్ వచ్చింది. అందులో కొంత మంది కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జెపి)లో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా డెంగ్యూతో బాధపడుతున్నారని ఆయన కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

కోవిడ్, డెంగ్యూ కారణంగా సిసోడియా ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. ఆయన రక్త ప్లేట్‌లెట్‌లు కూడా పడిపోతున్నాయని కూడా తెలిపింది. సిసోడియా బుధవారం ప్రభుత్వ ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరారు. జ్వరం , ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటంతో ఆయన చికిత్స కోసం చేరినట్లు ఆసుపత్రి తెలిపింది. సెప్టెంబర్ 14న మనీష్ సిసోడియా కరోనా భారిన పడ్డారు.

దాంతో అప్పటినుంచి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే తాజాగా సిసోడియాను మెరుగైన వైద్యం కోసం ఎల్‌ఎన్‌జెపి హాస్పిటల్ నుంచి సాకేత్‌లోని మాక్స్ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు ఆసుపత్రి హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇదిలావుంటే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కోవిడ్ -19 కు పాజిటివ్ గా పరీక్షించిన రెండవ మంత్రి మనీష్.. జూన్ లో, ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ కోవిడ్ తో ఆసుపత్రిలో చేరారు. 12 రోజుల పాటు చికిత్స పొందుతూ జూన్ 26న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

మీ విధానాలు అన్ని రాష్ట్రాలకి ఆదర్శం.. జగన్ పై మోడీ ప్రశంసలు..!

భారత్ బంద్.. అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు!

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి కరోనా పాజిటీవ్ ?

జంటనగరవాసులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన సిటీ బస్సులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -