Friday, April 26, 2024
- Advertisement -

కేంద్రంపై మండిప‌డుతున్న సెక్స్ వ‌ర్క‌ర్స్‌…..

- Advertisement -

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ఒకేదేశం…ఒకే టాక్స్ జీఎస్‌టీని తీసుకొచ్చింది.భారతదేశ అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అయిన జీఎస్టీ ఎఫెక్ట్ అన్ని వర్గాలపై పడుతున్న సంగతి తెలిసిందే.దీనిపై నిపునుల‌నుంచి కూడా తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశారు. అన్ని రంగాల‌పైనా తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతోంది.
అయితే ఇప్పుడు తాజాగా సెక్స్ వర్కర్లకు సైతం చుక్కలు చూపిస్తోంది జీఎస్‌టీ.శానిటరీ నాప్కిన్స్పై 12 శాతం జీఎస్టీ విధించడంతో ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన కలకతాలోని సోనాగచిలో సెక్స్ వర్కర్లు షాక్ తింటున్నారు.కేంద్రంపై మండిప‌డుతున్నారు.అయితే తాజా మళ్లీ జీఎస్టీ భారం 12 శాతం చేయడంతో ఇప్పుడు వారంతా మళ్లీ వెనుకటి పరిస్థితికి మళ్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది
జీఎస్టీ శ్లాబ్ లలో కండోమ్స్ పై జీరో ట్యాక్స్ నిర్ణయం బాగానే ఉన్నా నాప్కిన్స్పై 12 శాతం పన్ను విధించడం బాధాకరమని 130000 మంది సెక్స్ వర్కర్లతో కూడిన దర్బార్ మహిళా సమన్వయ కమిటీ(డీఎంఎస్ సీ) ఆవేదన వ్యక్తం చేసింది. సెక్స్ వ‌ర్క‌ర్ల‌కి సబ్సిడీపై నాప్ కిన్స్ ను అందిస్తున్నారు..జీఎస్‌టీతో వాటిపై మ‌రింత బారంప‌డ‌నుంది.
ధరలు పెరిగితే తాను నాప్ కిన్స్ను వాడబోనని సెక్స్ వర్కర్స్‌ చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందని ఆమె అన్నారు. న్యాప్ కిన్స్ వాడకం తమకు తప్పనిసరని.. ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి ఉంటుందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -